రంగారెడ్డిహోమ్

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు విస్తృత ప్రణాళిక

#Vikarabad

వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించేందుకు  విబి జి రామ్ జి కింద చేపట్టే పనులను వెంగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ మండలం గోదుమగూడ గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ  నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు విబి జి రామ్ జి కింద  చేపట్టిన వివిధ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఫామ్ పాండ్స్ , బోర్‌వెల్ రీచార్జ్ పనులు, పైకప్పు నీటి సేకరణ,  వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతల  పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చని కలెక్టర్ తెలిపారు.

వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్ పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులు సూచించారు.   అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విబి జి రామ్ జి  కింద పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని ఆయన అధికారులు  సూచించారు.  పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ  ఆవరణలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

వికారాబాద్ మండలంలో మంజూరైన 72 ఫాం పాండులు, 47 బోర్ వెల్ రీఛార్జ్, 16 పైకప్పు నీటి సేకరణ, 119 వ్యక్తిగత, 33 సామూహిక ఇంకుడు గుంతల పనుల లక్ష్యాలను అధిగమించే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో డిఆర్డిఓ శ్రీనివాస్, ఎంపీడీవో వినయ్ కుమార్, సర్పంచ్ స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి ఇందిర  సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్థులు  పాల్గొన్నారు.

Related posts

దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం

Satyam News

మరో చార్జిషీట్ దాఖలు చేసిన సిట్

Satyam News

కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం

Satyam News

‘నకిలీ మద్యం’ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్‌?

Satyam News

కల్తీ లడ్డులో మరో 11 మంది నిందితులు

Satyam News

ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు

Satyam News

Leave a Comment