ప్రత్యేకంహోమ్

భారత్ ను బలహీన పరిచేందుకు విదేశీ కుట్ర

#MohanBhagawat

దేశంలో అశాంతి, అరాచక పరిస్థితులు సృష్టించే ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా నిలవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు.

నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విజయదశమి వార్షిక ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌, అల్బేనియా, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి దేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలను మార్చడం ద్వారా దేశాల పరిస్థితులు మారిపోతాయనే వాదనలో వాస్తవం లేదని భగవత్‌ పేర్కొన్నారు.

భారత్‌ ఎదుగుదల ప్రపంచంలో ప్రతికూల ధోరణులకు అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్న కొన్ని శక్తులు దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వారి లక్ష్యాలు నెరవేరకుండా చూసేందుకు భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు, ఆందోళనలు సహజమేనని పేర్కొన్నారు. అయితే వాటి లక్ష్యం సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమే కావాలని స్పష్టం చేశారు. సమాజంలో విభేదాలు, చీలికలు సృష్టించడం, రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరించడం ఆందోళనల ఉద్దేశం కాకూడదని అన్నారు. చౌకబారు ప్రచారం కోసం నిరసనలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.

చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఆందోళనలవల్ల కావని భగవత్‌ అభిప్రాయపడ్డారు. దేశాన్ని నడిపించేది ప్రభుత్వం ఒక్కటే కాదని, సమాజానికి కూడా అంతే బాధ్యత ఉందని గుర్తుచేశారు. దేశం పట్ల బాధ్యతతో, పరిస్థితులను సానుకూలంగా మార్చాలనే సంకల్పంతో చేపట్టే ఉద్యమాలు సమర్థనీయమని, లేనిపక్షంలో అవి రాజకీయ ప్రయోజనాలకు వేదికలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందన్నారు.

గతంలోనూ కొన్ని శక్తులు ప్రజల్లోని బాధిత భావనను ఉపయోగించుకుని అశాంతి, అరాచక పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నించాయని భగవత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రపంచానికి భారత్‌ అవసరమే అయినప్పటికీ, బలమైన భారత్‌ మాత్రం కొన్ని శక్తులకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. సమాజంలో అనైక్యతను పెంచేందుకు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజలు ఐక్యంగా ఉంటే ఎవరూ భారత్‌ను అస్థిరపరచలేరని స్పష్టం చేశారు.

దేశంలోని వారిలో ఐక్యతా భావం ఉండాలని, మతం, ఆచారాలు, ఆహారం, సంస్కృతుల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ అందరూ ఒకటేననే భావనను నిలబెట్టుకోవాలని భగవత్‌ పిలుపునిచ్చారు. శతాబ్దాలుగా భారతీయులను కలిపి ఉంచుతున్న భావోద్వేగ బంధాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. భిన్నత్వాన్ని గౌరవిస్తూనే జాతీయ ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts

కాక్రోచ్ లకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Satyam News

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే

Satyam News

తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ పార్టీ నేతలపై చర్యలు

Satyam News

రాహుల్ గాంధీకి షాక్: పౌరసత్వంపై విచారణ

Satyam News

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

మా జీవితాలతో ఆడుకోవద్దు జగన్

Satyam News

Leave a Comment