ప్రత్యేకంహోమ్

జగన్ పులివెందులకు ఎందుకు వచ్చాడు?

#Jagan@Pulivendula

జగన్ పులివెందులకు ఎందుకు వచ్చాడు?

ఓటు వేయడానికి…

మరి ఓటు వేశాడా?

వేయకుండానే జగన్ బెంగళూరులోని యళహంక ప్యాలెస్ కు తిరిగి వెళ్లిపోయాడు…

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపల్ చైర్మన్ ల ఎన్నికల పోలింగ్ దాదాపుగా ప్రశాంతంగా ముగిసింది. అయితే రాష్ట్రంలో జరిగిన అన్ని సంఘటనల కన్నా ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే బెంగళూరు నుంచి పులివెందులకు వచ్చిన వైసీపీ అధినేత జగన్.. చివరకు తన ఓటు హక్కు వినియోగించుకోకుండానే తిరుగుపయనమయ్యారు. ఎన్నికలు జరిగిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ ఓటు వేయబోనని ప్రకటించారు. అంతేకాదు.. రీపోలింగ్ పెడితేనే బెంగళూరు నుంచి వచ్చి ఓటు వేస్తానని అన్నారు. ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు చూస్తే సంస్కరణలు ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి వచ్చిన వైసీపీ అధినేత జగన్.. మీడియా ముందుకు వచ్చి పోలింగ్ సరళిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో 70 మంది వైసీపీ ఏజెంట్లను బయటకు పంపించారని అన్నారు. అంతేకాదు.. ఇదే అంశంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఆర్‌వో కార్యాలయం వద్దకు వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించి హంగామా సృష్టించారు. వైసీపీ అధినేత జగన్ తీరుపై ప్రజాస్వామ్యవాదులు, అధికార కూటమి పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న జగన్.. ఓటు హక్కు వినియోగించుకోకుండా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్‌ ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

Related posts

అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దు కాదు

Satyam News

శత్రువుకు కూడా సాయం చేసిన లోకేష్‌

Satyam News

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

Satyam News

గాయకుడు గా మారిన దర్శకుడు పీసీ ఆదిత్య

Satyam News

Gen Z అంటే ఏమిటి

Satyam News

దళిత యువకుడికి సచివాలయంలో చిత్రహింసలు

Satyam News

Leave a Comment