జాతీయంహోమ్

ఏపీ పై ముసురుకున్న ‘మురసు తపాను’

#Rain

నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘మురసు తపాను’  కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 27 కి.మీ. వేగంతో కదులుతుందని ప్రస్తుతానికి చెన్నైకి 480 కిమీ, నెల్లూరుకు 550 కిమీ, మచిలీపట్నానికి  560 కిమీ, ఒంగోలుకు 600 కిమీ, విశాఖపట్నానికి 610 కిమీ, దూరంలో ఉందని వెల్లడించారు.

రేపు ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడి ఆ తర్వాత వాయువ్య దిశగా ప్రయాణించి రేపు అర్ధరాత్రి–ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరందాటే సమయంలో గంటకు 100 నుండి 110 కి.మీ వరకు గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళరాదని హెచ్చరించారు.

తుపాను ప్రభావంతో రానున్న మూడురోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు; కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80-90 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపిఎస్జీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తుపాను వలన ఏ సమస్య ఎదురైనా 9552300009 మన మిత్ర ద్వారా వెంటనే అధికారులకు తెలియజేయవచ్చన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

సహాయక చర్యలు కోసం ముందస్తుగా కృష్ణా(2), బాపట్ల(2), గుంటూరు(2), నెల్లూరు(2), ప్రకాశం(2), మార్కాపురం(1), పల్నాడు (1),  తిరుపతి (1)  మొత్తంగా 6 NDRF, 7 SDRF బృందాలు మోహరింపు చేశామని, అవసరమైతే వినియోగించడానికి మరికొన్ని బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మురసు తుపాను హెచ్చరికల నేపధ్యంలో రానున్న మూడు రోజులు వాతావరణ క్రింది విధంగా ఉండనున్నట్లు ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

సోమవారం (02-11-2026) :

కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఒకటి,రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

మంగళవారం (03-11-2026) :

అల్లూరి సీతారామ రాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఒకటి,రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

బుధవారం (04-11-2026) :

కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Related posts

పోలవరం ఎడమ కాలువ ద్వారా రేపు గోదావరి జలాల విడుదల

Satyam News

తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం

Satyam News

న్యూయార్క్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

Satyam News

పెళ్ళిళ్ళ సీజన్ లో పసిడి ప్రేమికులకు భారీ ఊరట

Satyam News

మరో మారు బయటపడ్డ జగన్ క్రూరత్వం?

Satyam News

మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం రైతులకు వరం

Satyam News

Leave a Comment