ముఖ్యంశాలుహోమ్

ఇందిరమ్మ ఇంట్లోనే భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

#Indirammahouse

ఒకవైపు దీపావళి పర్వదినం.. మరోవైపు తన జన్మదినం.. ఈ రెండు శుభసందర్భాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వినూత్నంగా పండుగను జరుపుకున్నారు. కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి ప్రారంభించి, వారి కుటుంబంతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలను బహూకరించిన సీఎం.. వారి ఇంట్లోనే సన్నబియ్యంతో వండిన భోజనాన్ని స్వీకరించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేశారు.

అనంతరం ఇంటి వద్దకు చేరుకున్న చిన్నారులతో కలిసి ముఖ్యమంత్రి టపాసులు కాల్చి దీపావళి వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ పెన్నులను బహూకరించి వారిని ఆనందపరిచారు. జన్మదిన వేడుకలను ఓ పేద కుటుంబం ఇంట్లో దీపావళి సంబరాలతో జరుపుకోవడం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రాధాన్యతను, ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి చాటిచెప్పారు.

Related posts

శ్రీశైల శరన్నవరాత్రి కి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

Satyam News

ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందా?

Satyam News

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల సందడి

Satyam News

జీవిత ఖైదీలు ఇక జీవిత భాగస్వాములు….

Satyam News

Petrole Cheating: పరీక్షల్లో 31.2 శాతం ఇథనాల్ గుర్తింపు!

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

Leave a Comment