సినిమాహోమ్

నేను పచ్చా చొక్కా మనిషిని…. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం

#Jagapathibabu

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. “నేను పచ్చ చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని” అంటూ జగపతిబాబు మనసు విప్పి మాట్లాడిన మాటలు పొలిటికల్, ఫిలిం వర్గాల్లో ఒక రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

రీసెంట్‌గా లోకేష్‌తో కలిసి ఒక షోలో మాట్లాడిన ఆయన.. “మా మామగారు, అత్తగారు టిడిపి ఎమ్మెల్యేలు. అప్పట్లో ‘శుభలగ్నం’ సినిమా సక్సెస్‌తో నేను కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు, పాలిటిక్స్ ఏంటో తెలియకపోయినా టీడీపీ కోసం క్యాంపెనింగ్ చేశా. వేలాది మంది జనం మధ్య ఆ రోజే మైక్ పట్టుకుని నిలబడ్డా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆన్ ద సేమ్ సైడ్” అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు.

అంతేకాదు, నవనవలాడే నవ్యాంధ్ర నిర్మాత, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడిపై జగపతిబాబు ఇచ్చిన ఎలివేషన్ నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉన్నాయి. ఈరోజు మనం హైదరాబాద్‌లో ఈ స్థాయి మౌలిక వసతులతో ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అది కేవలం చంద్రబాబు గారి విజన్ వల్లే అన్నారు. ఆనాడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన ఆ విజనరీ నాయకుడు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను కూడా అదే రీతిలో ప్రగతి పథంలో పరుగెత్తిస్తున్నారని కొనియాడారు.

చంద్రబాబు మార్క్ విజన్, దూరదృష్టి, రాష్ట్రాన్ని నిలబెట్టే సంకల్పానికి తానెప్పుడూ పెద్ద ఫ్యాన్ అని.. “బాబు గారి నాయకత్వంపై నాకు బలమైన నమ్మకం ఉంది. పార్టీ కంటే కూడా చంద్రబాబు అనే ఆ గొప్ప మనిషి, ఆయన ఆలోచనా విధానం నాకు చాలా ఇష్టం” అని జగపతిబాబు స్పష్టం చేశారు.

ఇక పార్టీ పట్ల, నాయకుడి పట్ల ఉన్న ఈ అభిమానంతోనే.. రీసెంట్‌గా జగపతి బాబు కజిన్ సిస్టర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు గుంటూరు మేయర్ పదవి టికెట్ ఇచ్చారు. దాంతో తన చెల్లి గెలుపు కోసం జగపతిబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ‘నా చెల్లి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను గుంటూరు మేయర్‌గా గెలిపించండి’ అంటూ ఆయన ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు.

గుంటూరు నగర ప్రగతి, మెరుగైన రహదారులు, స్వచ్ఛమైన తాగునీరు, ఆధునిక మౌలిక వసతుల కల్పన కేవలం లక్ష్మీ అపర్ణ నాయకత్వంతోనే సాధ్యమని ఆయన గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. జగపతిబాబు చెప్పిన మాటలపై, చంద్రబాబు మార్క్ పాలనపై నమ్మకంతో ఆ ఎన్నికల్లో ప్రజలు కోవెలమూడి లక్ష్మీ అపర్ణను ఘనవిజయంతో గెలిపించారు.

చంద్రబాబు నాయకత్వానికి టాలీవుడ్ సూపర్ స్టార్ ఇచ్చిన ఈ ఎలివేషన్.. అభివృద్ధికి జనం పట్టం కట్టిన తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సైలెంట్‌గా ఉన్నా సరైన సమయంలో చంద్రబాబు విజన్‌కు సపోర్ట్‌గా నిలిచిన జగపతిబాబు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Related posts

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News

కరువు నేల నుంచి పరిశ్రమల హబ్‌గా అనంతపురం

Satyam News

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News

కాక్రోచ్ లకు ఫండింగ్ ఇస్తున్న అమెరికన్లు?

Satyam News

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖుల హాజరుపై సమీక్ష

Satyam News

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News

Leave a Comment