ప్రకాశంహోమ్

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ!

#YVSubbareddy

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. అదే రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వ్యూహాత్మక మౌనం. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన, ఇటీవల మున్సిపల్ నుంచి నిన్నటి పరిషత్ ఎన్నికల వరకు పూర్తిగా సైలెంట్ అయిపోవడం వెనుక కేసుల భయమే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నా, వైసీపీ యంత్రాంగం అనాథలా మిగిలిపోయినా…వైవీ మాత్రం కేవలం తన చుట్టూ కమ్ముకున్న కేసుల నుంచి బయటపడేందుకే ప్రాధాన్యమిస్తున్నారన్న చర్చ వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్ల మధ్య నడుస్తోంది.

వైవీ సుబ్బారెడ్డి ఈ విధంగా పూర్తిగా వెనకడుగు వేయడానికి అసలు కారణం TTD లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారమేనని జిల్లా పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించిన సమయంలో జరిగిన పరిణామాలు, ఈ కేసులో సిట్  దర్యాప్తు వేగం పుంజుకోవడం, తన సన్నిహితుల చుట్టూ అరెస్టుల ఉచ్చు బిగుస్తుండటంతో ఆయన ఆందోళనలో పడ్డారు. తదుపరి టార్గెట్ తానేనన్న భయం, చట్టపరమైన పరిణామాలు చుట్టుముడతాయనే ఆందోళనే ఆయనను కదలకుండా చేశాయని తెలుస్తోంది.

ఇటీవల ముగిసిన పరిషత్ పోరులోనూ వైవీ సుబ్బారెడ్డి తీరు పూర్తిగా ఉదాసీనంగా తయారైంది. చీరాల, ఒంగోలు, మార్కాపురం వంటి కీలక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఆయన కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. టీడీపీ దాడికి ఎదురునిలిచేలా వ్యూహాలు రచించడం దేవుడెరుగు, కార్యకర్తలను రోడ్లపైకి తెచ్చి పోరాటాలు చేయించే ప్రయత్నం కూడా చేయలేదు. తనపై ఎక్కడ కేసులు తీవ్రమవుతాయోనన్న భయంతో ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారని, క్షేత్రస్థాయిలో పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టారని నేతలు మండిపడుతున్నారు. నాయకుడే కేసులకు భయపడి వెన్నుచూపితే తాము ఎవరి కోసం పోరాడాలంటూ కింది స్థాయి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ పెద్ద దిక్కుగా చెప్పుకునే వైవీ సుబ్బారెడ్డే వ్యక్తిగత కేసుల భయంతో ఇలా సైలెంట్ అయిపోతే, ఇక పార్టీకి దిక్కెవరనే ప్రశ్న కార్యకర్తల్లో బలంగా నాటుకుపోతోంది. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన నేతే చట్టపరమైన ఇబ్బందుల వల్ల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తుండటంతో, పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ప్రకాశం జిల్లాలో ఎదురవుతున్న ఈ పరిణామాలు, కేసుల భయంతో లీడర్ల వెనకడుగు వేస్తున్న తీరుపై అధినేత జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పార్టీని ఎలా గాడిలో పెడతారనే అంశంపైనే ఇప్పుడు క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Related posts

మంత్రి లోకేష్ సమర్థతకు దక్కిన గుర్తింపు

Satyam News

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి

Satyam News

ప్రధాని మోడీ ఈ సారి ప్రత్యేక తలపాగా….

Satyam News

విజయ సాయిరెడ్డి పార్టీ పెట్టడం లేదు!

Satyam News

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ 2026 పోస్టర్ ఆవిష్కరణ

Satyam News

Leave a Comment