రంగారెడ్డిహోమ్

చీప్ లిక్కర్ కలిపి విదేశీ మద్యం బ్రాండ్లు

#ShamshabadPolice

చీప్ లిక్కర్ ను ఖరీదైన మద్యం సీసాలో పోసి అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు ఒకడు. వివరాల్లోకి వెళితే బగ్గా డిస్టిలరీలో కొంతకాలంగా పని చేసి, అక్కడ పని మానివేసి క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను గ్రేటర్ హైదరాబాద్ డిటిఎఫ్ టీం నరేందర్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు.

గత ఆరు నెలలుగా వంగలి అశోక్ (43) అనే వ్యక్తి బగ్గా  డిస్టలరీ మద్యం తయారీ పరిశ్రమలో  లో పని మానివేసి క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. శంషాబాద్ లోని శాతం రాయి ప్రాంతంలో తన ఇంట్లో నే తక్కువ ధరలు కలిగిన చీప్ లిక్కర్ మద్యాన్ని ఖరీదైన మద్యం  బాటిళ్లలో  మిక్సింగ్ చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ విచారణలో వెల్లడయింది..!

మహమ్మద్ యాకూబ్ పాషా (29) అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ దుకాణంలో ఖరీదైన మద్యం బాటిల్లను తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి మూతలను తొలగించి అందులో రూ. 560 విలువచేసే డౌన్ టెన్  అనే చీప్ లిక్కర్ను బాటిళ్లలో నింపుతూ అమ్మకాలు సాగిస్తున్నాడని గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ భాస్కర్ గౌడ్ తెలిపారు.

ఈ విషయాన్ని పసిగట్టిన కానిస్టేబుల్ ధనుంజయ్ సీఐ సమాచారం ఇవ్వడంతో అందరు కలిసి వెళ్లి దాడి చేసి అశోక్ ఇంట్లో పెద్ద మొత్తంలో మిక్సింగ్ బాటిల్లను మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ లోని సాతంరాయి ప్రాంతంలో తన ఇంట్లో దాడులు నిర్వహించగా 10 ఫుల్ బాటిల్లు మిక్సింగ్ చేసిన బాటిల్స్ తో పాటు మరో 30 పైగా ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం సీసాలను మహమ్మద్ యాకూబ్ పాషా 29 ఇయర్స్ క్యాబ్ దుకాణం నుంచి తీసుకు వస్తున్నట్లు తెలపడంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇలా తక్కువ ధర కలిగినటువంటి మద్యాన్ని ఖరీదైనటువంటి జాన్ వెల్స్ న్ జానీ వాకర్, దివార్స్, 100 పేపర్స్ లాంటి ఖరీదైన బాటిల్లో తక్కువ ధర కలిగినటువంటి మద్యాన్ని నింపి అమ్మకాలు సాగిస్తున్నారు.

ఇలా చీప్ లిక్కర్ ను  మిక్సింగ్ చేసి మద్యం బాటిలను స్థానికంగా ఉన్న ఒక పదిమందికి అమ్మకాలు సాగిస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో సీఐ నరేందర్ తో పాటు ఎస్సై హనుమంతు నజీర్ పాషా ఇంచార్జ్ సీఐ భరత్ కుమార్ ధనుంజయ్ అభినయ్ కిషన్ భాస్కర్ ఉన్నారు.

నిందితులను మిక్సింగ్ మద్యం బాటిల్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఈ ఎస్ విజయ భాస్కర్ గౌడ్  తెలిపారు. మిక్సింగ్ మద్యం ముఠాను పట్టుకున్నటువంటి డిటిఎఫ్ టీమ్ ను గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఏ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ఈఎస్ విజయభాస్కర్ గౌడ్ అభినందించారు.

Related posts

నాయుడుపేటలో ఎన్‌.టి‌.ఆర్‌ విగ్రహ భూమి పూజ

Satyam News

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News

బీజేపీ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సమావేశం

Satyam News

బండ్ల గణేష్ కుమార్తె వివాహ నిశ్చితార్థం

Satyam News

కాలుష్యం అరికట్టేందుకు కఠిన చర్యలు

Satyam News

Leave a Comment