హైదరాబాద్హోమ్

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

#Maoist

నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) , బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీ (BJSAC) కార్యదర్శి అయిన పసునూరి నరహరి @ విశ్వనాథ్ @ సలై దా తెలంగాణ DGP  సి.వి. ఆనంద్  ఎదుట నేడు లొంగిపోయారు. ఆయనతో బాటు రాష్ట్ర కమిటీ సభ్యురాలు (SCM), మేదర దానమ్మ @ లత @ పూనం @ జోబా కూడా లొంగిపోయారు.

వీరు జన జీవన స్రవంతిలో చేరడం సిపిఐ (మావోయిస్టు) పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ గా పోలీసులు భావిస్తున్నారు. ఆ పార్టీకి మిగిలి ఉన్న ఏకైక తూర్పు ప్రాంతీయ బ్యూరో (ERB) కూడా పతనం అంచుకు చేరింది. పసునూరి నరహరి @ విశ్వనాథ్ @ సలైదా తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం. సోమిడి గ్రామంలో జన్మించాడు.

ఇతను 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు సోమిడి ప్రభుత్వ పాఠశాలలోనూ, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు హన్మకొండ జిల్లాలోని కాజీపేట ప్రభుత్వ పాఠశాలలోనూ తన విద్యాభ్యాసాని పూర్తి చేశాడు. తర్వాత, హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (MPC చదివారు: వరంగల్లో ని LB కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాడు కానీ, ‘రాడికం స్టూడెంట్స్ యూనియన్’ (RS U)తో అతనికి ఉన్న అనుబంధం కారణంగా మధ్యలోనే తన చదువునా ఆపేశాడు.

Related posts

మార్చి లో గూగుల్ కు భూమి పూజ

Satyam News

యూపీలో పట్టుబడ్డ స్టాండప్ కమెడియన్ అనుదీప్

Satyam News

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam News

కూటమి పాలనలో అన్ని అక్రమ అరెస్టులే

Satyam News

పశ్చిమ బెంగాల్ లో చీలిపోయిన మమతా బెనర్జీ పార్టీ

Satyam News

మేడారం జాతర పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ

Satyam News

Leave a Comment