పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా బాగా జరుగుతున్నాయని అదే సమయంలో నాణ్యత కూడా బాగుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీ ఈ ఓ సంజీవ్ వోహ్రా ఆంధ్రప్రదేశ్ అన్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలవరం ప్రాజెక్ట్ పనులను సమగ్రంగా సమీక్షించటంతో పాటు క్షేత్ర స్థాయిలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అక్కడికక్కడే పనుల నాణ్యత పరీక్షలు నిర్వహించారు.
ఉదయాన్నే పోలవరం ప్రాజెక్ట్ సమావేశ మందిరానికి చేరుకున్న వోహ్రా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురామ్, చీఫ్ ఇంజనీర్ ఎం రమేష్ కుమార్ పనుల వివరాలను జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ( ర్మ్ రే ఐ ఎల్ ) ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. ప్రతి పనిని ఆయన సమీక్షించారు. ఆయన గతంలో పర్య టించిన సమయంలో చేసిన సూచనలు, ఇచ్చిన సలహాల పురోగతి, ఇటీవల విదేశీ నిపుణుల బృందం పర్యటన సమయంలో ఇచ్చిన సలహాలు అమలు తీరును అధికారులు, మేఘా ప్రతినిధులు సి ఈ ఓ కు వివరించారు.
గత నెలలో తుఫాను వచ్చిందని, తిరిగి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నీటి లెవల్ పెరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. పనులు వేగవంతంగా జరుగు తున్న నేపథ్యంలో కార్మికులు ఎంత మంది, యంత్రాలు ఎన్ని పనిచేస్తున్నాయి అని అడిగి తెలుసు కున్నారు.
సమీక్ష అనంతరం వోహ్రా, పీపీఏ అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ ఈ ఎన్ సీ కే నరసింహ మూర్తి, పోలవరం ప్రాజెక్టు ఎస్ ఈ పీ రామచంద్ర రావు, నాణ్యత విభాగం సీఈ శేషుబాబు, ఎస్ ఈ నరసింహ రావు, ఈ ఈ లు బాలకృష్ణ, శ్రీనివాస్, ప్రేమ్ చంద్, ఎం ఈ ఐ ఎల్ పోలవరం ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఏ గంగాధర్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య తదితరులతో కలిసి ఈ సీ ఆర్ ఎఫ్ నిర్మాణ ప్రాంతం, జి హిల్, జి డ్యాష్ హిల్ మొదలైన ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. మట్టి, ఇసుక, రాయి, కంకర, కాంక్రీట్ మొదలైన వాటి నాణ్యత ను పరిశీలించారు. పరీక్షించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల వేగంతో పాటు నాణ్యత విషయం లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ వద్దని చెప్పారు. నాణ్యత పరీక్షలు నిరంతరం చేస్తూ రికార్డులు భద్ర పరిచాలని సూచించారు. తుఫాను సమయంలో జరిగిన పనులకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజు నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు నాణ్యత తో పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.
