కరీంనగర్హోమ్

ఆకలి తీర్చి.. అక్షరాలకు వెలుగులు దిద్దుతున్న సింగరేణి!

#Singareni

విద్యార్థుల ఆకలి తీర్చి, వారి చదువుకు తోడ్పాటునందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి సింగరేణి సంస్థ అండగా నిలుస్తోంది. ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ల ఏర్పాటుకు రూ.61.44 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను కేటాయించింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశంలో హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహణలో ఈ వంటశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజూ ఉచితంగా పౌష్టిక అల్పాహారం అందించనున్నారు. సుమారు 8 వేల పాఠశాలలు ఈ కిచెన్ల పరిధిలోకి రానున్నాయి.

ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ప్రారంభం

తొలిదశలో కొడంగల్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లోనూ వంటశాలలను ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్రాంతాల కోసం సింగరేణి రూ.21.03 కోట్ల సీఎస్ఆర్ నిధులను కేటాయించింది. మిగిలిన సింగరేణి, కొత్తగూడెం, సూర్యాపేట (మునగాల), కాగజ్‌నగర్, భూపాలపల్లి ప్రాంతాల్లో కిచెన్ల ఏర్పాటుకు మరో రూ.38.41 కోట్లను కేటాయించింది. దీంతో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ పథకం అమలుకు అవసరమైన వంటశాలలు అందుబాటులోకి రానున్నాయి.

జిల్లాల వారీగా కిచెన్ల వివరాలు

కొత్తగూడెం :  23 మండలాల పరిధిలోని 1,310 పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు రూ.8.75 కోట్లతో కిచెన్ ఏర్పాటు.

సూర్యాపేట : హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 1,029 పాఠశాలల కోసం రూ.9.61 కోట్లతో వంటశాల నిర్మాణం.

మధిర : 16 మండలాల్లోని 879 పాఠశాలలను కవర్ చేస్తూ రూ.7.53 కోట్లతో కిచెన్ ఏర్పాటు. దీనిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.

సింగరేణి (ఖమ్మం): 11 మండలాల్లోని 639 పాఠశాలలకు సేవలందించేందుకు రూ.8.96 కోట్లతో కిచెన్ ఏర్పాటు చేయనున్నారు.

కాగజ్‌నగర్: ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని 1,008 పాఠశాలల కోసం రూ.7.53 కోట్లతో కిచెన్ నిర్మాణం.

మంచిర్యాల: 18 మండలాల్లోని 757 పాఠశాలలను కవర్ చేస్తూ రూ.7.53 కోట్లతో కిచెన్ ఏర్పాటు.

మంథని: పెద్దపల్లి జిల్లాలోని 19 మండలాల్లో ఉన్న 711 పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు రూ.5.97 కోట్లతో కిచెన్ ఏర్పాటు.

భూపాలపల్లి : ఏడు మండలాల్లోని 229 పాఠశాలల కోసం రూ.3.56 కోట్లతో వంటశాల ఏర్పాటు చేయనున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం.. చదువుకు భరోసా

గ్రామీణ, పేద విద్యార్థులకు ఉదయాన్నే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంపొందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు మధ్యలోనే చదువు మానేసే వారి సంఖ్య తగ్గించేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు పాఠశాల భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సీఎస్ఆర్ నిధులు అందించిన సింగరేణి సంస్థ.. తాజాగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలోనూ భాగస్వామ్యమైంది. విద్యుత్ వెలుగులు అందించడంతో పాటు భావితరాల విద్యాభివృద్ధికి తోడ్పడుతూ సామాజిక బాధ్యతను చాటుకుంటోంది.

Related posts

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: 3 శాతం డీఏ పెంపు

Satyam News

టీఆర్ఎస్ నేతలపై సీతక్క అనుచరుల దాడి

Satyam News

రామతీర్థం లో మిథిల మైదానంలో వైభవంగా శ్రీరామ నవమి

Satyam News

సత్యసాయి లేకున్నా ఇంకా ఎనర్జీ ఇక్కడే ఉంది

Satyam News

జగన్‌కు RSS చీఫ్‌ వార్నింగ్!

Satyam News

రూ.38 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

Satyam News

Leave a Comment