హైదరాబాద్హోమ్

డీలిమిటేషన్‌తో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదు

#BJPRamachandrarao

మహిళా రిజర్వేషన్లు, నియోజక వర్గాల పునర్విభజన  ద్వారా అన్ని వర్గాలకు రాజకీయంగా సమన్యాయం జరుగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. డీలిమిటేషన్‌తో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాంచందర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

అనంతరం మీడియాతో రాంచందర్ రావు మాట్లాడుతూ ముఖ్యాంశాలు వెల్లడించారు. మహిళలకు రాజకీయ అధికారమే పూలే ఆశయాలకు నిజమైన నివాళి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు మహిళా విద్య, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. వారి ఆశయాలకు అనుగుణంగా మహిళలకు విద్యతో పాటు రాజకీయ అధికారం కూడా దక్కాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిందన్నారు. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశంపై ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ‘ఒక వ్యక్తి – ఒక ఓటు – ఒక విలువ’ సూత్రం ఆధారంగా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొన్నారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుత సీట్ల సంఖ్యను దామాషా ప్రకారం 50 శాతం పెంచే ఆలోచనతో కేంద్రం ముందుకెళ్తోందన్నారు.

ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 170కి పైగా, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 25 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 1971లో దేశ జనాభా 56 కోట్లుగా ఉన్నప్పుడు లోక్‌సభలో 543 స్థానాలు ఉండేవని, ప్రస్తుతం దేశ జనాభా 140 నుంచి 145 కోట్లకు చేరిందని వివరించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 2021 జనగణన జరగకపోవడంతో 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు మహిళలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

నియోజకవర్గాల మధ్య ఓటర్ల వ్యత్యాసాలు తొలగించాలి

ప్రస్తుతం నియోజకవర్గాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని రాంచందర్ రావు వివరించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 40 లక్షల ఓట్లు ఉంటే, సికింద్రాబాద్‌లో 11 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయని ఉదాహరణగా పేర్కొన్నారు. అలాగే శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 7.5 లక్షల ఓట్లు ఉండగా, అంబర్‌పేటలో 2.5 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యత్యాసాలను సరిచేసి సమాన ప్రాతినిధ్యం కల్పించడమే డీలిమిటేషన్ ఉద్దేశమని అన్నారు.

గతంలో రాజీవ్ గాంధీ హయాంలో మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చ జరిగినప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మిత్రపక్షాలే బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బయటకు మహిళా రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తూ, మరోవైపు డీలిమిటేషన్, రిజర్వేషన్ బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అర్థం లేని వ్యాఖ్యలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, మహిళలకు రాజకీయ న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. మహిళలు, వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

రంజాన్ సందర్భంగా రేవంత్ ఇఫ్తార్ విందు

Satyam News

6 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

Satyam News

ఆహార కల్తీ నియంత్రణకు సర్వైలెన్స్ టీమ్ (H-FAST)

Satyam News

వైసీపీ ‘అనుబంధ’ పోలీసు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Satyam News

ఘనంగా టీఎన్‌ఏఐ 6వ ద్వైవార్షిక రాష్ట్ర సదస్సు

Satyam News

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News

Leave a Comment