విశాఖపట్నం హోమ్

50 శాతం మెడికల్ సీట్లు అమ్ముకున్న జగన్

#PallaSrinivasaRao

కట్టని మెడికల్ కాలేజీ పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు 18 ప్రశ్నలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో కూడా 50 శాతం మెడికల్‌ సీట్లు ప్రైవేటుకు కేటాయించింది జగన్‌ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా పెరుగుతాయనేది వాస్తవం అని ఆయన తెలిపారు. ప్రజలు అడిగే క్రింది ప్రశ్నలకు జగన్‌ సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.

1. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రైవేట్‌ కోటాకు 50శాతం సీట్లు కేటాయిస్తూ జీ.ఓ.నెం: 107, 108,133 లను విడుదల చేసింది జగన్‌ ప్రభుత్వం కాదా?

2. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూపాయి కూడా జగన్‌ ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెట్టలేదు?

3. ఖర్చుచేసిన రూ.1550కోట్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే కాదా?

4. నాలుగేళ్ల జగన్‌ పాలనలో నిర్మాణాలు పూర్తి అయింది కేవలం 18 శాతం మాత్రమే కాదా? ఈ తీరులో కూటమి ప్రభుత్వం పనిచేస్తే 17 కాలేజీల నిర్మాణాలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందనేది వాస్తవం కాదా?

5. మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు ఇలా ఏళ్లు గడిస్తే 1750 మెడికల్‌ సీట్లు మురిగిపోయే ప్రమాదం లేదా? అలాగే పీజీ సీట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉన్న విషయం వాస్తవం కాదా?

6. జగన్‌ ప్రభుత్వ విధానం కన్నా కూటమి ప్రభుత్వ పీపీపీ విధానం వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా వస్తాయనేది నిజం కాదా? అలాగే ప్రైవేట్‌ కోటాలో కూడా మరో 110 సీట్లు పెరిగి మొత్తం 220 సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా వస్తాయనేది వాస్తవం కాదా?

7. పీపీపీ పద్ధతిలో కూడా ఇప్పటిలాగే 50శాతం మెడికల్‌ సీట్లు ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేస్తారనేది నిజం కాదా? ప్రభుత్వ ఫీజు మాత్రమే ఉంటుందనేది వాస్తవం కాదా?

8. పీపీపీ విధానంలో అయితే రాబోయే రెండేళ్లలో కాలేజీల నిర్మాణాలు జరిగి అందులో 1750 సీట్లు త్వరగా మన విద్యార్థులు పొందుతారు అనేది నిజం కాదా?

9. కర్నాటకలో 12 మెడికల్‌ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మిస్తున్నది నిజం కాదా? అలాగే అనేక రాష్ట్రాల్లో పీపీపీ విధానం జరుగుతుంది కదా?

10.  గత చంద్రబాబు పాలనలో జేగురుపాడు విద్యుత్‌ ప్లాంట్లు పీపీపీ విధానంలో నిర్మించారు, 33 ఏళ్లు పూర్తి అయినందున అది నేడు ప్రభుత్వ పరమైంది నిజం కాదా?

11. గంగవరం పోర్టును ప్రైవేటుకు అమ్మేసింది జగన్‌ ప్రభుత్వం కాదా? విశాఖ స్టీలు భూముల్ని ప్రైవేటుకు అమ్మేయమని చెప్పింది జగన్‌ కాదా?

12. జగన్‌ విధ్వంస పాలన వల్ల కూటమి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటుంది వాస్తవం కాదా? ఉన్న కొద్దిపాటి నిధులు మెడికల్‌ కాలేజీలకు ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలకు కోతలు పడవా? ఉద్యోగులకు జీతాలు చెల్లించని స్థితి రాదా? రోడ్లు వేయలేని స్థితి రాదా? ఇలా దెబ్బతీయాలనే కదా జగన్‌ కుట్ర?

13. 1995- 2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకొక మెడికల్‌ కాలేజీ, రెవిన్యూ డివిజన్‌ కొక ఇంజనీరింగ్‌ కాలేజీ పెట్టడం వలనే కదా నేడు రాష్ట్రంలో డాక్టర్ల కొరత లేకుండా ఉంది – అలాగే ప్రతి నలుగురు ఎన్‌.ఆర్‌.ఐలో ఒకరు తెలుగువారు

ఉన్నారంటే అది ఆనాడు చంద్రబాబు తీసుకున్న మంచి నిర్ణయం కాదా?

14. నేడు ఏపీలో 18 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, మరో 18 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలతో సమతూకంగా ఉందంటే అది చంద్రబాబు అనుసరించిన హైబ్రిడ్‌ విధానం కాదా?

15. చైనా, వియాత్నాం హైబ్రిడ్‌ విధానం అమలు పరచడం వల్ల ఆ దేశాలు ప్రముఖ ఆర్థిక శక్తులుగా నేడు విలసిల్లుతున్నవి- క్యూబా, నార్త్‌ కొరియా దేశాలు పిడివాదం వల్ల, హైబ్రిడ్‌ విధానం అవలంబించక పోవడం వల్ల వెనకబడి పోయింది వాస్తవం కాదా?

16. మెడికల్‌ కాలేజీల పేరుతో జగన్‌ చేస్తున్నది రాజకీయ స్వార్థ ప్రయోజనాలకే గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది వాస్తవం కాదా?

17. నీతి ఆయోగ్‌ రిపోర్ట్‌ ప్రకారం వైద్య, ఆరోగ్య ప్రమాణాల్లో చంద్రబాబు పాలన

(2014- 19)లో 4 వస్థానంలో ఉన్న ఏపీని, జగన్‌ పాలన (2019- 24)లో 10వ స్థానానికి దిగజారింది వాస్తవం కాదా?

18. చంద్రబాబు ఒక్క మెడికల్‌ కాలేజీని స్థాపించలేదని జగన్‌ ముఠా చేసే ప్రచారం పచ్చి అబద్ధం కాదా? చంద్రబాబు, ఎన్టీఆర్‌ పాలనలో ఉమ్మడి, నవ్యాంధ్రలో 28 మెడికల్‌ కాలేజీలు స్థాపించింది నిజం కాదా? చంద్రబాబు సంకల్పం హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం అనేది బహిరంగ సత్యం కాదా?

Related posts

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News

జగన్‌.. నీ జే బ్రాండ్స్‌ మర్చిపోయావా..లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్‌

Satyam News

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News

Leave a Comment

error: Content is protected !!