నల్గొండహోమ్

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

#crime

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో ఇద్దరు చిన్నారులను వారి తల్లిదండ్రులు తీవ్రంగా హింసించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు నకిరికంటి రవి, ఇందు దంపతులు హుజూర్‌నగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ధనుష్, రేవంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

స్థానికుల కథనం ప్రకారం, దంపతులు తమ పిల్లలను తరచూ కొడుతూ శారీరకంగా వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇద్దరు చిన్నారులను తీవ్రంగా కొట్టడమే కాకుండా, చేతులు, కాళ్లపై వేడి గరిటెతో కాల్చినట్లు సమాచారం. చిన్నారుల పరిస్థితిని చూసి చలించిపోయిన స్థానికులు వెంటనే వారిని తమ వెంట తీసుకుని హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు.

ఈ ఘటనపై స్పందించిన ఎస్సై నరేష్ చిన్నారుల పరిస్థితిని చూసి మానవత్వంతో స్పందించారు. ముందుగా వారికి భోజనం ఏర్పాటు చేసి, అనంతరం తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. తాత్కాలికంగా చిన్నారులను స్థానికుల సంరక్షణలో ఉంచినట్లు సమాచారం.

తల్లిదండ్రులను మరోసారి పిలిపించి సమగ్ర కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. చిన్నారులపై ఇలాంటి వేధింపులు పునరావృతమైతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే చిన్నారులను అనాథాశ్రమంలో చేర్పించి వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని కూడా వెల్లడించారు. ఘటనపై పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు.

Related posts

13 నుంచి న్యూఢిల్లీలో ఎస్‌జెఎఫ్‌ఐ జాతీయ మహాసభ

Satyam News

గూగుల్ క్లౌడ్ ఏపీకి గేమ్ ఛేంజర్

Satyam News

ఇప్పుడు… మీ రోజువారీ స్టైల్‌కి కూడా లగ్జరీ టచ్

Satyam News

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ

Satyam News

బిల్ గేట్స్ పర్యటన కోసం అంతా సిద్ధం

Satyam News

హైద‌రాబాద్ మెట్రోపై చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం

Satyam News

Leave a Comment