25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

#YSJagan

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ మూడు రాజధానుల పేరుతో ఆడిన మూడు ముక్కలాట గురించి ఇంకా ఎవరు మర్చిపోలేదు. అంతలోనే మరో మూడు ముక్కలాటకు తెరలేపినట్లు కనిపిస్తోంది. అప్పుడు అధికార వికేంద్రకరణ పేరుతో గేమ్స్‌ ఆడారు. ఇప్పుడు పోయిన అధికారం దక్కించుకోవడానికి కొత్త గేమ్‌ స్టార్ట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈసారి ఆట ఏపీతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోకి స్పెడ్ అయింది. గ్రేటర్‌ రాయలసీమ పేరుతో ఏపీలో సీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలు.. కర్నాటకలో అరడజను, తమిళనాడులో రెండు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ తెరపైకి వచ్చింది.

రాయలసీమ రాష్ట్ర సమితి పేరుతో కొత్త వ్యక్తులు కనిపించినా.. వారి వెనుక తాడేపల్లి ప్యాలెస్‌ ఫుల్‌ సపోర్ట్‌ ఉందని సమాచారం. ఇప్పుడు అర్జంట్‌గా ప్రత్యేక రాయలసీమ డిమాండ్ ఎందుకు ఎత్తుకొన్నారంటే.. అమరాతిని నాశనం చేసిందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ వాష్‌ ఔట్‌ అయిపోయింది. పవన్‌ కళ్యాణ్ జనసేన దెబ్బకు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫ్యాన్‌ పార్టీ ఫ్యూచర్‌ ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. టీడీపీ, జనసేన బంధాన్ని విడదీయడం కష్టమని వైసీపీ పెద్దలకు క్లారిటీ వచ్చినట్లు ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్‌లో గెలవలేని యుద్ధం చేయడం కంటే.. తమకు పట్టున్న సీమ జిల్లాల నుంచి విభజన రాజకీయం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం సక్సెస్‌ అయితే వైసీపీకి అంతకంటే కావాల్సిందేమీ ఉండదు. ఒకవేళ సెపరేట్‌ సెంటిమెంట్‌ ఆ స్థాయిలో రగులుకోకపోయినా.. విశాఖలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూపించి.. సీమకు అన్యాయం చేస్తున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ ఫేక్‌ మూమెంట్‌ని వాడుకొంటారు. 1998లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక రాష్ట్ర నినాదం ఎత్తుకున్నారు. తర్వాత ఆ ఉద్యమాన్ని కేసీఆర్‌ హైజాక్‌ చేసి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి.. దాని అధినేత జగన్‌కు తెలంగాణలో అడుగుపెట్టే ఛాన్స్‌ కూడా ఇవ్వలేదనేది అందరికీ తెలుసు. ఇప్పుడు సీమ ఉద్యమాన్ని దగ్గరుండి ప్రారంభిస్తున్నారు. ఫ్యూచర్‌లో సీమలో అడుగు కూడా పెట్టనివ్వరేమో అనేది ఆలోచించుకోవాలి.

Related posts

శ్రీవారికి వెండి గంగాళం విరాళం

Satyam News

ఎల్ నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల పై దృష్టి సారించాలి

Satyam News

బీ ఎం ఎస్ జాతీయ అధ్యక్షుడు గా సుంకరి మల్లేశం

Satyam News

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు

Satyam News

బ్యాంకు రుణాలు సకాలంలో అందాలి

Satyam News

అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

Satyam News

Leave a Comment