26.7 C
Hyderabad
September 20, 2026
జాతీయంహోమ్

అక్రమ బొగ్గు మాఫియా పై ఈడీ దాడులు

#Kolkata

అక్రమ బొగ్గు తవ్వకం, రవాణా మరియు నిల్వ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ED) భారీ సోదాలు నిర్వహిస్తోంది. దుర్గాపూర్, పురూలియా, హౌరా, కోల్‌కతా జిల్లాల్లో మొత్తం 24 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల సమయంలో ప్రారంభమైన ఈ సోదాలలో 100 మందికి పైగా ఈడీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సోదాలు ప్రధానంగా బొగ్గు మాఫియాతో అనుబంధం ఉన్నారని అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, కోక్‌ ప్లాంట్లు, అక్రమ టోల్ కలెక్షన్ బూత్ లు, చెక్‌పోస్టులు మరియు ఇతర సంబంధిత ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. సోదాలు జరుగుతున్న వారి జాబితాలో నరేంద్ర ఖార్కా, యుధిష్టిర్ ఘోష్, కృష్ణ మురారి కయాల్, చిన్మయీ మండల్, రాజ్‌కిషోర్ యాదవ్ తదితరులు ఉన్నారని సమాచారం.

అక్రమ బొగ్గు రవాణా మరియు వ్యాపారానికి సంబంధించిన ఆధారాలను గుర్తించడానికి ఈడీ అధికారులు పలు కీలక పత్రాలు, డిజిటల్ డేటా మరియు బ్యాంకింగ్ వివరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఉదయం ప్రారంభమైన ఈ దాడులు కొనసాగుతుండగా, పరిశోధనలో బయటపడే వివరాలు కీలక మలుపు తిప్పే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ఏమన్నారంటే

Satyam News

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Satyam News

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News

దానాలకు శ్రేష్ఠం సంక్రాంతి పండుగ రోజు

Satyam News

IBM వచ్చేసింది….. విశాఖలో ఆఫీస్ ప్రారంభం

Satyam News

Leave a Comment