26.3 C
Hyderabad
September 19, 2026
చిత్తూరుహోమ్

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

#TTD

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా అహ్వానించారు.

అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు.

ఛైర్మ‌న్‌, ఈవో శ్రీవారి చిత్ర పటాన్ని  తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.

Related posts

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి కన్నుమూత

Satyam News

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

Satyam News

ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారానికి భారీ విరాళాలు

Satyam News

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News

విజయసాయి రెడ్డి టార్గెట్ భారతీ రెడ్డా?

Satyam News

ఫార్మా సిటీ భూములు వెనక్కు తిరిగి ఇవ్వాలి

Satyam News

Leave a Comment