25.2 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

రాంగోపాల్ వర్మ ఇన్ అండ్ యాజ్ “మ్యాడ్ మాన్స్టర్”

#RamgopalVarma

నిజ జీవితంలో “షో మ్యాన్” ఆయిన దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం “షో మ్యాన్”. “మ్యాడ్ మాన్స్టర్” అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటుడు సుమన్ ఇందులో విలన్ గా నటిస్తుండడం విశేషం. సుమన్ విలన్ గా నటించిన రజినీకాంత్ చిత్రం “శివాజీ” ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. “నూతన్” అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడు.

ఆర్జీవీతో ఇంతకుముందు “ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2” చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి… భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ 120గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాంగోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. రాంగోపాల్ వర్మ హీరోగా… సుమన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నూతన్!!

Related posts

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

Satyam News

రోడ్డు ప్రమాదం లో హీరో భారత్ కాంత్ మృతి

Satyam News

ఖాళీ పేజీలు, మ్యాన్యువల్ మార్కులు..APPSC స్కామ్‌లో నిజాలు!

Satyam News

అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలౌతుందా?

Satyam News

మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులు పునఃప్రారంభం

Satyam News

అజిత్ పవార్ విమానం కూలింది ఇలా…

Satyam News

Leave a Comment