ముఖ్యంశాలుహోమ్

జెన్-జెడ్ పై కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు

#KanganaRanaut

జెన్-జెడ్ (Gen Z) నిరసనకారులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రద్దయిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలోని నిరసనలో పాల్గొన్న యువతను లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శలు గుప్పించారు.

జెన్-జెడ్‌ను “జెనరేషన్ గట్టర్ (Generation Gutter)”గా అభివర్ణించిన కంగనా, “బాధ్యత లేకుండా స్వతంత్రంగా జీవించాలనుకునే తరం” అంటూ వ్యాఖ్యానించారు.

మహిళల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, “తమను పాశ్చాత్యీకరణ పొందిన భారతీయ మహిళలుగా చెప్పుకునే ఈ యువతులు చదువులోనూ రాణించలేరు. అలాగే గృహిణులుగా కూడా ఉండలేరు” అని అన్నారు. అంతేకాకుండా, “మాదకద్రవ్యాల వినియోగం, మద్యం సేవించడం లేదా అనేక సంబంధాలను తమ స్వేచ్ఛగా గొప్పగా చెప్పుకుంటున్నారు” అంటూ కంగనా విమర్శించారు.

ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహిళలు, యువతపై అవమానకర వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు.

Related posts

ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు

Satyam News

పార్టీ జెండా గద్దె నమూనా ఆవిష్కరించిన కవిత

Satyam News

ది ట్రాన్స్‌పోర్టర్ సునీల్ రెడ్డి ఎవరు?

Satyam News

గోవా పర్యాటక విధానం బాపట్లకు ఆదర్శం

Satyam News

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

Satyam News

Leave a Comment