25.2 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

మరో కన్నడ చిత్రంలో నటిస్తున్న డాక్టర్ పిసి ఆదిత్య

#PCAditya

తెలుగు నటుడు విలక్షణ దర్శకుడుడాక్టర్ పిసి ఆదిత్య  ఇటీవలే కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టారు. కృష్ణమోహన్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న దైవపుత్ర చిత్రంలో ఎమ్మెల్యేగా నటించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. పిసి ఆదిత్యను నటుడిగా మరో అవకాశం వరించింది.  NAVIAGARU CINEMAS బ్యానర్ పై కన్నడ నిర్మాత  దర్శక నటుడు నవీన్ కుమార్ తెలుగు కన్నడ భాషలో నిర్మిస్తున్న గురు శిష్యులు( వర్కింగ్ టైటిల్) చిత్రంలో కీలక పాత్రలో గురువుగా తెలుగు నటుడు దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను ఎంపిక చేశారు.

శిష్యుడిగా నవీన్ కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో బెంగళూరులో ప్రారంభిస్తారు. చిత్రం కొంత భాగం షూటింగ్ హైదరాబాదులో కూడా నిర్వహిస్తామని నవీన్ కుమార్ చెప్పారు. దర్శకుడు పిసి ఆదిత్య స్పందిస్తూ తాను దైవపుత్రలో ఎమ్మెల్యేగా నటించిన సన్నివేశాలు వర్కింగ్ స్టిల్స్ చూసి నవీన్ కుమార్ తన గురు శిష్యులు సినిమాకు నన్ను గురువుగా ఎంపిక చేయటం సీనియర్ గా నన్ను గౌరవించినట్లుగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలుగువారికి మరింత గౌరవం తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు. ఈ చిత్రానికి మరొక ప్రత్యేకత ఏంటంటే గురు శిష్యులు తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ పిసి ఆదిత్య రాయటం.  

Related posts

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Satyam News

కొత్తగా 8 పోర్టు సిటీలు…. ఏపీకి బ్లూ ఎకానమీ బూస్టర్..!!

Satyam News

జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ పథకం అమలు

Satyam News

విద్యా రంగంలో భారీ పెట్టుబడులకు సాయం చేయండి

Satyam News

శ్రీ తిమ్మప్ప స్వామి కి గొడుగుల వితరణ

Satyam News

చౌమహల్లాలో సూఫీ మధురిమలు

Satyam News

Leave a Comment