25.2 C
Hyderabad
September 20, 2026
విజయనగరంహోమ్

మొన్న ఏఆర్ డీఎస్పీ నేడు ఎస్పీ… బాస్ ల సేవాతత్పరత

మొన్న ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి తాజాగా ఎస్పీ దామోదర్ సేవా త‌త్స‌ర‌త‌ను చాటుకున్న బాస్ లు.వివ‌రాల్లోకి వెళితే విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుర్ల కు దగ్గరలో బైక్ ప్రమాదానికి గురై గాయప‌డ్డ‌ మహిళను విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్వయంగా సపర్యలు చేసి, అటుగా వస్తున్న ఆటోలో దగ్గరుండి ఎక్కించి వెంటనే దగ్గరలో ఉన్న నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించిన ఘ‌ట‌న శుక్ర‌వారం రాత్రి జ‌రిగింది.

వివరాల్లోకి వెళ్ళితే.. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గరివిడిలో జరిగిన అభ్యుదయం సైకిల్ యాత్ర కార్యక్రమం లో పాల్గొని తిరిగి వస్తున్న క్ర‌మంలో గుర్ల మండ‌లం దుగ్గివలసకి చెందిన దంపతులు బైక్‌ పై వస్తున్న సమయంలో బైకు ప్రమాదానికి గురై రోడ్ పై పడిపోవడంతో, వెనుక కూర్చున్న మహిళ తీవ్రంగా గాయపడినట్లు కారులో వ‌స్తున్న ఎస్పీ దామోద‌ర్ గుర్తించారు.

వెంటనే, ఎస్పీ తన వాహనాన్ని ఆపి, గాయపడిన మహిళకు సపర్యలు చేసి, మంచినీరు అందించి, ఆమెకు, తన భర్త కు ధైర్యం చెప్పి వెంటనే అటుగా వస్తున్న ఆటోను ఆపి గాయపడిన మహిళను ఆటోలోకి స్వయంగా ఎక్కించి దగ్గరలో ఉన్న నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించి సేవ నిర‌త‌ని చాటి చెప్పారు.

రెండు రోజుల క్రిత‌మే ఏఆర్ డీఎస్పీ కోటి రెడ్డి ఇలానే ఓ క్ష‌త‌గాత్రుడ‌ని ద‌గ్గ‌రుండీ చికిత్స‌కై హాస్ప‌ట‌ల్ త‌ర‌లించ‌గా ఇవాళ జిల్లా ఎస్పీ దామోదార్ సేవా త‌త్స‌ర‌త‌ను జిల్లా ప్ర‌జ‌ల‌కు చూపించారు.

Related posts

జగన్ కోటరీపై ఈడీ పంజా…!

Satyam News

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

Satyam News

ఖైరతాబాద్‌ పేరును ‘గణేష్‌పురి’గా మార్చాలి

Satyam News

ఈ ఏడాది కొత్తగా 3 పోర్టులు.. ఏపీకి బ్లూ ఎకానమీ బూస్ట్‌

Satyam News

నేపాల్ వరదల్లో వందలాది మందిని కాపాడిన దేవత

Satyam News

స్పీడ్ బోటు ప్రమాదం: 19 మంది భారతీయులు మృతి?

Satyam News

Leave a Comment