23.7 C
Hyderabad
September 25, 2026
కడపహోమ్

శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణం

రాజంపేట పట్టణం ఈడిగపాలెం లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీ తిరుప్పావై భక్త సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శబసు రంగనాథ స్వామి కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అంతకు ముందుగా శ్రీ తిరుప్పావై భక్త సేవా సమితి సభ్యులు ఆలయ గో పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయంలో పూజల అనంతరం ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ధనుర్మాసంలో ప్రతి ఏడాది శ్రీ తిరుప్పావై భక్త సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మి దేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణోత్సవం ఆనవాయితీగా నిర్వహించడం వస్తుంది. అందులో భాగంగా ఏడాది కూడా శ్రీ తిరుప్పావై భక్త సేవా సమితి 4 వ మారు రాజంపేట పట్టణములోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్ లో జనవరి 3వ తేదీ శనివారం సాయంత్రం కళ్యాణోత్సవం వైభవముగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

కళ్యాణోత్సవములో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. శ్రీ మహావిష్ణువు ప్రీతిపాత్రమైన ధనుర్మాసములో శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మి దేవి సమేత తిలకించడం ద్వారా భక్తులు తమ కోరికలను ఆ దేవదేవుని ఆశీర్వాద ఫలితంగా, ఆ బ్రహ్మాండ నాయకుని కృపకు పాత్రులు అవుతారని పురాణాలు పేర్కొంటున్నాయి.

Related posts

బీజేపీ ప్రభుత్వానికి మమత తాజా హెచ్చరిక

Satyam News

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”

Satyam News

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ

Satyam News

బంగారం స్మగ్లింగ్: నటి రన్యారావుకు రూ.102 కోట్ల భారీ జరిమానా

Satyam News

పురుషుడిలో స్త్రీ లక్షణాలు: గుంటూరు లో అరుదైన వ్యాధి

Satyam News

Leave a Comment