25.2 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

కలెక్టర్ కు పిర్యాదు చేసినా చర్యలు నిల్

#GREIVAMCE

వనపర్తి జిల్లా కేంద్రంలోని 33వ వార్డు వల్లభనగర్ లో మురికి కాల్వను కబ్జా చేసి పిల్లర్ నిర్మాణం చేసి గది నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కబ్జాను తొలగించాలని జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో పిర్యాదు చేసినా చర్యలు లేవని రాజాపేట వేణురెడ్డి (సెల్ నంబర్ 9441234971) తెలిపారు.

కబ్జా గురించి చాలా సార్లు కలెక్టర్ ప్రజావాణిలో పిర్యాదు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రజావాణిలో ఇచ్చిన పిర్యాదులో కోరారు. వల్లభనగర్ ఆర్ ఆర్ఎస్ఎస్. కార్యాలయం తూర్పు వైపులో కాల్వ పై చేసిన అక్రమ నిర్మాణం ఫొటోను ప్రజావాణిలో ఇచ్చామని తెలిపారు. మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా పని చేస్తున్నారని,వనపర్తిలో కాల్వలపై కప్పు వేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు.కాల్వపై ఉన్న కప్పు, అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని అయన కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పిల్లనిచ్చిన మామపై దాడి చేసిన అల్లుడు

Satyam News

తిరుమలలో శాలువాల కుంభకోణంపై విచారణ

Satyam News

గూగుల్‌ డేటా సెంటర్‌తో  2 లక్షల ఉద్యోగాలు… ఇదీ అసలు లెక్క!

Satyam News

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

Satyam News

పేదల కల సాకారం.. రేపే ఏపీలో మహా గృహ సంబరం!

Satyam News

బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అమలు

Satyam News

Leave a Comment