25.2 C
Hyderabad
September 20, 2026
అనంతపురంహోమ్

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ..!!ఎలక్ట్రిక్‌ కార్లు, బైకులు చూశారు.. ఎలక్ట్రిక్‌ విమానాల గురించి విన్నారా.. లేకపోయిన పర్వాలేదు.. త్వరలో ఏపీలో విద్యుత్‌ విమానాలు చక్కర్లు కొట్టబోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్ పరిశ్రమ ఏర్పాటవుతోంది.

ఇక్కడ రన్‌వే అవసరం లేకుండా.. ఉన్న చోట నుంచే గాల్లోకి లేచే.. వర్టికల్‌ టేకాఫ్‌.. ల్యాండింగ్‌ విమానాలను ఉత్పత్తి చేస్తారు. సాంతికేతిక రంగంలో, పారిశ్రామికంగా ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాలన్న.. సీఎం చంద్రబాబు విజన్‌లో భాగంగా ఈ స్కై ఫ్యాక్టరీని ఏపీకి తీసుకొచ్చారు.

బెంగళరు కేంద్రంగా పనిచేసే.. సర్లా ఏవియేషన్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ కంపెనీ 500 ఎకరాల్లో 1300 కోట్ల ఖర్చుతో స్కై ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీల మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ప్రారంభించబోతోంది.

మొదటి దశలో అనంతపురం జిల్లా తిమ్మసముద్రం గ్రామం దగ్గర 330 కోట్ల పెట్టుబడితో 150 ఎకరాల్లో బిల్డింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. సెకెండ్‌ ఫేజ్‌లో మరో 350 ఎకరాల్లో విస్తరణ పనులు చేపడతారు. ఈ ఫ్యాక్టరీలో ఏడాది వెయ్యి ఎయిర్‌ ట్యాక్సీలు తయారు చేస్తారు.

2027 నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసిన.. ఉత్పత్తి స్టార్ట్‌ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఎయిర్‌ ట్యాక్సీలో ఉపయోగించే అన్ని రకాల విడి భాగాలను ఇక్కడే రూపందిస్తారు. ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ద్వారా బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

మొదట ఆరు సీట్ల సామర్ధ్యంలో వెర్టికల్‌ టేకాఫ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ని అభివృద్ధి చేస్తారు. వీటి కోసం వెర్ టీపోర్టులు నిర్మిస్తారు. ఇప్పటికే ఈ రంగంలో నిష్ణాతులైన లిలియమ్‌, వోలోకాప్టర్‌, జోబీ ఏవియేషన్‌ వంటి సంస్థల సహకారంతో అతి తక్కువ సమయంలో ఎయిర్‌ ట్యాక్సీలను నిర్మాణానికి ప్లాన్‌ చేశారు.

2030 నాటికి మెట్రో నగరాల్లో ఓలా, ఉబర్‌ తరహాలో ఎయిర్‌ ట్యాక్సీలను నడిపించాలని సర్లా ఏవియేషన్‌ ప్రతినిధులు ఆశిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. ఎయిర్‌ అంబులెన్సులు.. ఇతర అత్యవసర సేవలను వేగంగా అందించే అవకాశం ఉంటుంది.

Related posts

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News

ప్రియ మిత్రమా ఫ్రాన్స్ మిమ్మల్ని ప్రేమిస్తున్నది

Satyam News

మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎoసీ గ్రీన్ సిగ్నల్

Satyam News

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

11వ అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్–2026 పోటీ ప్రారంభం

Satyam News

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్‌ ది ఇయర్‌..చంద్రబాబు

Satyam News

Leave a Comment