25.2 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

కాలభైరవునికి కలకండ, అటుకుల పాయసం నైవేద్యం

కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే.. బుధవారం పూట చేయాలి.

కాలభైరవుడిని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి వుందంటున్నారు పండితులు.

ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే.. వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి. మాంసాహారం ముట్టకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్లాలి. రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి, పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి. తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి.

కాలభైరవుని తలచి ధ్యానించాలి. తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచి పెట్టాలి. మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. ఇంకా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా ఆయన అనుగ్రహం పొందవచ్చు.

కాలభైరవునికి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Related posts

పిఠాపురం నుంచి వర్మ అవుట్..కమిటీకి కసరత్తు!

Satyam News

ఆధ్యాత్మిక భావనలతో టెంపుల్ టూరిజం

Satyam News

గ్రూప్‌ 1 అక్రమాలు నిజమే.. వైసీపీకి షాక్‌ ఇచ్చిన సిట్‌..

Satyam News

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News

ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసు పై చంద్రబాబు సీరియస్

Satyam News

హిల్ట్ పాలసీ పై ఇచ్చిన జి.ఓ రద్దు చేయాలి

Satyam News

Leave a Comment