హైదరాబాద్హోమ్

ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ కు పీఎం మోడీ

#Modi

ఈ నెల పదో తేదీన హైదరాబాద్ కు పీఎం మోడీ రానున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ హిమాయత్ నగర్ నారాయణ గూడాలో స్వయంగా వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూఈ నెల 10వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ జరగనుందని ఈ సభకు పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు సభలో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.”ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కూడా వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోందని,ఒక కుటుంబ పాలన నుంచి, అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.అందులో భాగంగానే ఈ రోజు ఎక్కడ చూసినా ‘బిజెపి’కి అనుకూలమైన పవనాలు వీస్తున్నాయని కేంద్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

పీఎం మోడీ ఉగ్రవాదంపై సింధూర్ తో యుద్ధం చేసి ఉగ్రవాదాన్ని దేశంలో తుద ముట్టించారన్నారు. పీఎం మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుకున్నాయన్నారు. పేద ప్రజలందరూ మోదీ గారి వైపు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

కార్యకర్తలందరూ ఐకమత్యంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి.”అని అన్నారు. 10న జరగబోయే బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Related posts

తెలంగాణ ను వదలని పే టీ ఏం వైసీపీ బ్యాచ్

Satyam News

22, 23న గద్వాల, వనపర్తి కి సమాచార కమిషనర్ల రాక

Satyam News

హోర్ముజ్ జలసంధిని తెరిచేశాం: డోనాల్డ్ ట్రంప్

Satyam News

పేద ముస్లిం పిల్లల సామూహిక ఖత్నా కార్యక్రమం

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

Satyam News

వైసీపీ వర్గపోరులో నవులూరి చెన్నారెడ్డి బలి

Satyam News

Leave a Comment