ప్రత్యేకంహోమ్

జీవిత ఖైదీలు ఇక జీవిత భాగస్వాములు….

#Marriage

అది ఒక జైలు…. అందులో ఇద్దరు జీవిత ఖైదీలు… ఇద్దరూ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నవారే. అలాంటి వారి ఇద్దరి మధ్య అదీ కూడా జైలు గోడల మధ్య ప్రేమ పుట్టింది. దాంతో ఆ ఇద్దరు జీవిత ఖైదీలు వివాహానికి సిద్ధమైనారు. విచిత్రంగా ఉంది కదూ…. ఇది నిజంగానే జరిగింది. సినిమా కథ కాదు.

జైపూర్‌లోని ఓపెన్‌ ఎయిర్ జైలులో (సంగానేర్ ఓపెన్ జైలు) జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు హైప్రొఫైల్ హత్య కేసుల నిందితుల మధ్య ఏర్పడిన ప్రేమ ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోంది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ప్రియా సేథ్ (34) అనే ఒక మహిళా ఖైదీ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడిని వలలో వేసి, అనంతరం అతన్ని హత్య చేసి శవాన్ని సూట్‌కేస్‌లో దాచిన కేసులో దోషిగా తేలింది.

హనుమాన్ ప్రసాద్ (29) తాను సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఆమె భర్తతో పాటు పిల్లలను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. సంగానేర్ ఓపెన్ జైలులో ఉంటూ ఇద్దరూ పరిచయం పెంచుకుని, క్రమంగా ప్రేమలో పడ్డారు. తాజాగా వీరిద్దరికీ 15 రోజుల పరోల్ మంజూరు కావడంతో, ఈ వివాహానికి మార్గం సుగమమైంది. జనవరి 7న రాజస్థాన్ హైకోర్టు వీరి పరోల్ దరఖాస్తులను ఏడు రోజుల్లో పరిశీలించాలని పరోల్ కమిటీని ఆదేశించినట్లు వారి న్యాయవాది విశ్రామ్ ప్రజాపత్ తెలిపారు.

కోర్టు ఆదేశాల మేరకు కమిటీ పరోల్‌కు అనుమతి ఇచ్చి, బుధవారం వీరిద్దరిని జైలు నుంచి విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఈ వివాహం అల్వార్ జిల్లా బరోడామియోలో, ప్రసాద్ స్వగ్రామంలో జరగనుంది. గత ఏడాది కాలంగా ఓపెన్ జైలులో ఉంటూ ఇద్దరూ మరింత సన్నిహితులయ్యారని వర్గాలు తెలిపాయి.

రాజస్థాన్ ప్రిజనర్స్ ఓపెన్ ఎయిర్ క్యాంప్ రూల్స్–1972 ప్రకారం, ఇక్కడ ఖైదీలు పగటిపూట బయట పనిచేసి, సాయంత్రానికి తిరిగి క్యాంప్‌కు చేరుకోవచ్చు. ప్రియా సేథ్ 2018లో జరిగిన సంచలన దుష్యంత్ శర్మ (27) హత్య కేసులో దోషిగా తేలింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకుని, బజాజ్‌నగర్‌లోని అద్దె ఫ్లాట్‌లో అతన్ని బంధించి హత్య చేసి, శవాన్ని నగర శివార్లలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.

2023లో ఆమెకు జీవిత ఖైదు శిక్ష పడింది. అలాగే, ప్రసాద్ 2017లో అల్వార్‌లో జరిగిన ఓ దారుణ హత్య కేసులో దోషిగా తేలాడు. ఒక వ్యక్తి, అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడిని హత్య చేసిన కేసులో అతనికి 2023లో జీవిత ఖైదు విధించారు. బాధితుడి భార్య సంతోష్ శర్మతో అక్రమ సంబంధం పెట్టుకుని, మత్తుమందులు ఇచ్చి కుటుంబాన్ని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

అయితే పరోల్ మంజూరుపై బాధితుల కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దుష్యంత్ శర్మ కుటుంబం తరఫున న్యాయవాదిగా ఉన్న సందీప్ లోహారియా, తమకు సమాచారం ఇవ్వకుండా పరోల్ మంజూరు చేశారని, ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు.

ఈ వివాహం అసాధారణ పరిస్థితుల్లో జరగడం వల్ల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే జైలు అధికారులు మాత్రం, ఓపెన్ ఎయిర్ క్యాంప్ వ్యవస్థలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ పరోల్, పునరావాస అంశాలను పరిశీలించి నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Related posts

వ్యూహాత్మకంగా లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ?

Satyam News

భారత్ కు క్యూ కడుతున్న ప్రపంచ దిగ్గజ కంపెనీలు

Satyam News

ఈ రోజు లోకేశ్ – రేపు చంద్రబాబు – ఢిల్లీకి!

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం

Satyam News

వాడపల్లి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Satyam News

Leave a Comment