ముఖ్యంశాలుహోమ్

పొత్తుల కోసం తహతహలాడుతున్న ‘సింగిల్ సింహం’

#JaganInUPA

ఇంతకాలం ఎవరూ కలవకపోవడంతో ‘సింగిల్ సింహం’గా పేరు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వేరే పార్టీలతో పొత్తు కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తమిళనాడుకు చెందిన అగ్ర నేతలతో కలిసి కాంగ్రెస్ నేతృత్వంలోని UPA (I.N.D.I.A కూటమి) వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బెంగుళూరులో మొదలైన రాజకీయ సంప్రదింపులు ఇప్పుడు చెన్నై వేదికగా కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో గత కొంతకాలంగా సాగుతున్న రాయబారం ఫలితాన్ని ఇవ్వబోతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించిన నటుడు విజయ్‌లను UPAలోకి తీసుకురావడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ స్థాయిలో కూడా సానుకూల స్పందన లభించినట్లు సమాచారం.

జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి పలు రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తిరుమల లడ్డూ వివాదంలో బీజేపీతో పాటు అనుబంధ సంస్థలు తీవ్ర విమర్శలు చేయడం, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రాజకీయ మద్దతు లభించకపోవడం, జాతీయ మీడియాలో తనపై నెగటివ్ కథనాల వెనుక కేంద్ర పెద్దల పాత్ర ఉందన్న భావన జగన్‌ను బీజేపీకి దూరం చేస్తున్నట్లు చెబుతున్నారు.

మోదీకి సవాల్ విసరనున్న జగన్

ఈ నేపథ్యంలో UPAలో చేరడం ద్వారా మోదీ ప్రభుత్వానికి రాజకీయంగా గట్టి సవాల్ విసరాలన్న ఆలోచనకు జగన్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తమిళనాడులో రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్ కూడా కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన పార్టీ TVK సిద్ధాంతాల్లో పెరియార్, అంబేద్కర్‌లతో పాటు కాంగ్రెస్ దిగ్గజం కామరాజ్ ఆలోచనలను చేర్చడం ద్వారా కాంగ్రెస్‌తో పొత్తుకు తలుపులు తెరిచినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

డీఎంకేతో పొత్తు విషయంలో కాంగ్రెస్ నేతల్లో ఉన్న అసంతృప్తి నేపథ్యంలో, విజయ్ పార్టీ కాంగ్రెస్‌కు ‘పవర్ షేరింగ్’ ఆఫర్ చేసిందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన కీలక భేటీల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, విజయ్, జగన్ మోహన్ రెడ్డిల మధ్య చర్చలు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం.

దక్షిణాదిలో ఒక లౌకిక కూటమిని నిర్మించాలన్న దిశగా ఈ నేతలు ముందడుగు వేస్తున్నారని, త్వరలోనే జగన్ ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి దీనిపై అధికారికంగా స్పష్టత ఇచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ అనుకూల మీడియా ద్వారా త్వరలోనే ఈ అంశంపై ప్రకటన రావచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. చెన్నైలో జరిగిన వివాహ వేడుక సందర్భంగా జగన్, విజయ్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

విజయ్ తో చేతులు కలిపిన జగన్

ఈ సమావేశాన్ని వైసీపీ సోషల్ మీడియా ఖాతాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మరింత వేడెక్కింది. జగన్ స్వయంగా వెళ్లి విజయ్‌కు స్వాగతం పలకడం వంటి పరిణామాలు ఈ భేటీకి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ఇదిలా ఉండగా, పార్లమెంటులో ఈవీఎంలపై అనుమానాల అంశాన్ని వైసీపీ లేవనెత్తడం ద్వారా జగన్ ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వానికి రాజకీయ సంకేతాలు పంపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వ్యూహాత్మక అడుగుల ఫలితంగానే ఇప్పుడు కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు వేగంగా పడుతున్నాయని అంటున్నారు. అయితే, లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో జగన్‌తో సన్నిహితంగా కనిపించడం విజయ్‌కు రాజకీయంగా నష్టమయ్యే అవకాశముందన్న ఆందోళన కూడా తమిళనాడులో వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా హిందూ ఓటర్లలో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, దక్షిణాదిలో మోదీకి వ్యతిరేకంగా బలమైన కూటమి కట్టాలంటే జగన్ మద్దతు కీలకమని మరికొందరు వాదిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ దక్షిణాది రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక మలుపులు తప్పవన్న సంకేతాలను ఇస్తున్నాయి.

Related posts

జర్నలిస్టుల హెల్త్ కార్డుల సమస్య త్వరలో పరిష్కరిస్తా

Satyam News

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News

సవరించిన జీవో ప్రకారం కొత్త అక్రెడిటేషన్ లు

Satyam News

గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో భారీగా పతనమైన రూపాయి

Satyam News

లడ్డూ ఎఫెక్ట్…. గుడి సెట్టింగ్‌కి గుడ్‌ బై… ఈసారి కొత్త రూట్‌….!!

Satyam News

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

Satyam News

Leave a Comment