26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

#Tirumala

తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్‌ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలిపారు.

ఇంజినీరింగ్, విద్యుత్, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు. తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరిస్తారని వివరించారు. చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4వ రోజు ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పలపై ఉత్సవ మూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారని చెప్పారు. కాగా తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26,  27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌లో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఈలు శ్రీనివాసరావు, సుధాకర్, డిఈ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

నీట్ గా లీక్ చేసిన లెక్చరర్లు: మరొకరు అరెస్టు

Satyam News

ఇరాన్ ఇంధన ప్లాంట్ లపై దాడి 5 రోజులు వాయిదా

Satyam News

ప్రజాకవి కాళోజీ యాదిలో ‘తెలంగాణ భాషా దినోత్సవం’

Satyam News

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

Satyam News

మారుతున్న భారతావనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్

Satyam News

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

Satyam News

Leave a Comment