25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి

#RevanthReddy

ఇరాన్ తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు.

యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు.

ఇరాన్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు.

ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్తోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Related posts

వైజాగుకు వైకాపా తలాక్!

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

హై స్పీడ్ రైల్‌ నెట్‌వర్క్‌ హబ్‌గా ఏపీ

Satyam News

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Satyam News

భారత్ ను ముంచెత్తనున్న అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు?

Satyam News

Leave a Comment