25.2 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

రెండు టవర్లకే స్టాలిన్‌పై ప్రశంసలు…. మరి ఏపీ చూస్తే.!!

#QuantumValley

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. చెన్నైలోని కలైజ్ఞర్‌ సెంటినరీ పార్క్‌లో ఐటీ టవర్‌ని ప్రారంభించారు. చెన్నైలో ఐటీ రంగం అభివృద్ధి కోసం ప్రారంభించిన ఈ టవర్‌ని.. డీఎంకే కార్యకర్తలు.. చోళులు, పాండ్యుల కాలంలో నిర్మించిన భారీ టెంపుల్‌ టవర్స్.. ఇతర నిర్మాణాలతో పోల్చుతున్నారు.

ఒక్క టవర్‌కే తమిళనాడు సీఎం స్టాలిన్‌కి ఇంత భారీ ఎలివేషన్లు వేస్తున్నారు తమిళ తంబీలు. పారిశ్రామికంగా చెన్నై నగరం టాప్‌ పొజిషన్‌లో ఉన్నా.. సాఫ్ట్‌వేర్‌లో మాత్రం బెంగళూరు, హైదరాబాద్‌, పూణే, నోయిడా, గురుగ్రామ్‌ వంటి నగరాల తర్వాతే ఉంటుంది.

ఐటీ అంటే ప్రజలకు అవగాహన లేని రోజుల్లో.. కంప్యూటర్లు కూడు పెడతాయా అనే విమర్శలను ఎదుర్కొని.. హైదరాబాద్‌ను ఐటీలో బెంగళూరుతో పోటీ పడే స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి.. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంతం.

మొదట్లో హైటెక్‌ సిటీ టవర్‌తోనే హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ప్రస్థానం ప్రారంభించినా.. మైండ్‌ స్పేస్, సైబర్‌ గేట్‌ వే, రహేజా ఐటీ పార్క్‌.. వంటి భారీ భవనాలను తీసుకురావడం ద్వారా.. ఏకంగా సైబరాబాద్‌ సిటీ నిర్మాణానికి ఆద్యుడిగా నిలిచారు.

చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసి.. నిర్మాణం చేసిన సైబరాబాద్‌ని తర్వాత వచ్చిన పాలకులు కూడా అభివృద్ధి పథంలో నడిపించడంతో.. ఇప్పటికీ హైదరాబాద్‌.. బెంగళూరుతో పోటీ పడుతోంది. సైబరాబాద్‌ నిర్మించిన అనుభవంతో.. ఏపీలో నూతన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

మధ్యలో ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణం నిలిచిపోయినా.. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి.

గ్రీన్‌ ఫీల్డ్‌ కేపిటల్ సిటీలో నిర్మిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు.. నివాస గృహాల టవర్లు.. అమరావతిని.. మహానగరం స్థాయికి అభివృద్ధి చేసే ప్రణాళికలో తొలి అడుగు మాత్రమే. క్వాంటం కంప్యూటర్లు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, గ్లోబల్‌ ఫిల్మ్‌ సిటీలు, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలు.. ఇలా అన్ని రంగాలకు చెందిన నిర్మాణాలతో అమరావతి కాస్మోపోలిటన్‌ సిటీగా డెవలప్‌ అవుతోంది.

చెన్నైలోని ఐటీ టవర్‌ని ప్రారంభించిన తమిళనాడు సీఎంకి.. ఆయన పార్టీ అభిమానులు వేస్తున్న ఎలివేషన్లు చూశాక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. నవ్యాంధ్రప్రదేశ్‌లో చేసిన అభివృద్ధికి చంద్రబాబుకు గుడి కట్టినా తక్కువే అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.

Related posts

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News

కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు కృషి

Satyam News

పీ ఓ కే లో ఉగ్రరూపం దాల్చిన నిరసనలు

Satyam News

పెంచలయ్య కుటుంబానికి అండగా కోటంరెడ్డి

Satyam News

ఏఐలో దేశంలోనే ఏపీ టాప్‌…. లోకేష్‌కి కేంద్ర మంత్రి కితాబు

Satyam News

గల్ఫ్ యుద్ధం నేపధ్యం లో ప్రధాని మోడీ సమీక్ష

Satyam News

Leave a Comment