విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి జొన్నగుడ్డిలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ గోవిందరావులు ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ తో పాటు విజయననగరం వన్ టౌన్,టూటౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్లు ఆర్వీకే.చౌదరి,శ్రీనివాస్ రావులు 150 మంది సిబ్బందితో ఉదయం ఆరుగంటల నుంచీ ఏడున్నర వరకు నగరంలోని బాలాజీ జంక్షన్ ఏరియా జొన్నగుడ్డి లో ఏక కాలంలో సిబ్బంది అంతా విస్త్రత సోదాలు ఆపై తనిఖీలు చేసారు.
ప్రతీ ఇంటిలో ఉన్న వ్యక్తి, ఆధార్,రేషన్,గ్యాస్,కరెంట్ బిల్లలను క్షుణ్ణంగా తనిఖీ చేసారు.మొత్తం జొన్నగుడ్డి ఏరియాను 14 వీధులుగా విభజించిన పోలీసులు అణువణువునా చెకింగ్స్ నిర్వహించారు.ఎస్ఐలీలావతి,నవీన్ పడాల్,కనకరాజులు అయిదుగురేసి కానిస్టేబుళ్లతో ప్రతీ ఇంటిలో ఉన్న వాళ్ల ఆధారాలు సేకరించారు.
జొన్నగుడ్డిలో రామ్ మందిరం వద్ద నిర్మాణంలో ఉన్న రెండస్తుల భవనంలో రెండు రోజుల క్రితమే కొంతమంది కుర్రాళ్లు గంజాయి సేవించి పంపకాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు కంట్రోల్ రూమ్ కు సమాచారం అందింది. ఆ సమాచారంతో ఆ ప్రాంతాన్ని ఎలెర్ట్ చేయడంతో పాటు గంజాయి సేవించిన స్థలాన్ని పోలీసులు కార్డన్ సెర్చ్ ద్వారా గుర్తించారు.
ఈ సందర్భంగా అక్కడే జొన్నగుడ్డివాసులైన కేవలం మహిళలతో ఏఎస్సీ సౌమ్యలత సమావేశం అయ్యారు. మీ ప్రాంతంలోని అనుమానితులు వచ్చినా, అసాంఘీక కార్యక్రమాలు జరగినా, మద్యం సేవించినా,మత్తు పదార్దాలు రవాణ జరిగినా ,గంజాయి అక్రమ రవాణతో ఎవరినైనా చూసిన తక్షణమే మాకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా నే ఉంచుతామన్నారు.
పోలీసులు చెప్పిన నిబందనలను పాటించనిన యోడల,పోలీసులు కేసు కడితే కనీసం 6 నెలలు జైలు శిక్ష పడుతుందని ఏఎస్పీ హెచ్చరించారు.అపరిచత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం. ఎన్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేసామన్నారు. ఈ ఆపరేషన్ లో రికార్డులు సరిగ్గా లేని 22 బైక్ లను పోలీసు స్టేషనుకు తరలించామన్నారు.
అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్భందనం చేసామన్నారు.రాబోయే రోజుల్లో “ఆపరేషన్ వజ్రప్రహార్”భాగంగా ఇదే తరహాలో జిల్లాలో తరుచూ మరిన్ని ప్రాంతాల్లో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్స్ ఆకస్మికంగా చేపట్ట నున్నామన్నారు.
కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషనులో ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, నాటుసారావంటివి లభ్యం కాలేదన్నారు. జోన్నగుడ్డి ప్రాంతంలో ఉన్న హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తులతో మాట్లాడి, వారి కదలికలపై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు.
అనంతరం బస్తీవాసులతో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని విజ్ఙప్తి చేసారు.ఈ తనిఖీలలో ఈగల్ టీం ఆర్ఐ టి.ధనుంజయ నాయుడు,విజయ్ కుమార్ ,వన్ టౌన్,టూటౌన్ పోలీస్ స్టేషన్ ల నుంచీ సిబ్బంది పాల్గొన్నారు.
