మెదక్హోమ్

రబీ రైతు భరోసా కోసం రాహుల్ గాంధీ కి వినతి

తెలంగాణ ముఖ్యమంత్రి రబీ పంటకు రైతు భరోసా వేస్తలేడు, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా వేసేలా చూడాలి అంటూ చేతిలో పట్టా పాస్ బుక్ లు పట్టుకొని రాహుల్ గాంధీ కి, తెలంగాణ గవర్నర్ కి సెల్ఫీ వీడియోలు తీసి ఫోన్ మాద్యమాల ద్వారా ముఖరా కె రైతులు పంపారు.

ప్రతి రైతుకు రైతు భరోసా ఎకరానికి 15000 వేస్తానని చెప్పి ఇప్పుడు రబీ పంట కోతకు వచ్చినా రైతుభరోసా ఎకరానికి 6000 రైతుభరోసా ఊసే లేదు, రేవంత్ రెడ్డి రబీ రైతుభరోసా సంక్రాతి కి వేస్తానని చెప్పి వెయ్యలేదని, తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాత వేస్తామన్నాడు తేదీల మీద తేదీలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నాడు అని వారు అన్నారు.

రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో చెప్పారు ప్రతి రైతుకు ఎకరానికి 15000 రైతుభరోసా ఇస్తానని. మీ ముఖ్యమంత్రి మాత్రం రైతుభరోసా వెయ్యక రైతులను మోసం చేస్తున్నాడు అంటూ వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తలేడు అని గుర్తు చేశారు.

రభి పంట కూడా వేసాము రభి పంట కోతకు కూడా వచ్చింది అయినా ఇంకా రైతు భరోసా రాలేదు, రైతు భరోసా లేక రైతుల బ్రతుకులు మళ్ళీ శావుకారుల దగ్గర వెళ్లి ఆడుకోవాల్సిన పరిస్థితి అయింది, రైతులను తెలంగాణ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ ప్రభుత్వం రభి రైతుభరోసా వేయకుండా మోసం చేస్తుంది అని కనీసం గవర్నర్ గారు మీరైనా స్పందించి ఇప్పుడైనా అందరికి రైతు భరోసా వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని వ్యవసాయ క్షేత్రంలో దుఃఖంతో రైతులు నిలబడి సోసెల్ మీడియా ద్వారా తెలంగాణ గవర్నర్ మరియు రాహుల్ గాంధీకి సోషల్ మీడియా ద్వారా సెల్ఫీవీడియోలు తీసి పంపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విట్టల్, ప్రలాద్, దత్త, నాగనాథ్, తిరుపతి, తులసిరామ్, మహిళ రైతులు పాల్గొన్నారు

Related posts

శిథిలావస్థకు చేరుకున్న టిడ్కో ఇళ్లు

Satyam News

నటి సంచితా ఉగాలే ఆత్మహత్య

Satyam News

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Satyam News

వైసీపీ నేత కబ్జాపై మౌనం.. పవన్‌పై ఫేక్‌ ప్రచారం: ఇదేం తెలంగాణవాదం?

Satyam News

తిరుమలలో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Satyam News

దక్షిణ మధ్య రైల్వేలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

Leave a Comment