26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

మహిళా రిటైర్ ఎస్‌.ఐ. మల్లేశ్వరి సేవలు అభినందనీయం

#Malleswari

విజయవాడ సిటీ మహిళా ఎస్‌.ఐ.గా విధులు నిర్వహిస్తూ ఇటీవల రిటైర్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి మల్లేశ్వరిని అభినందించారు. మల్లేశ్వరి భర్త కూడా పోలీస్ శాఖలోనే సేవలందిస్తూ 2024 ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని మంత్రి అనిత పేర్కొన్నారు.

ఆ వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి మల్లేశ్వరి మరింత సంకల్పంతో ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. తన ఆసక్తితో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందే కాంపెన్సేషన్ విభాగంలో చేరి, అనేక కుటుంబాలకు త్వరితగతిన పరిహారం అందేలా మల్లేశ్వరి అపారమైన కృషి చేసినట్లు మంత్రి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా వెంటనే కాంపెన్సేషన్ అందేలా ఆమె నిరంతరం సేవలు అందించారని కొనియాడారు.

మల్లేశ్వరి కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కాంపెన్సేషన్ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా, ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి అనిత వెల్లడించారు. రిటైర్ అయిన తర్వాత కూడా అదే సేవాభావంతో ప్రజలకు సహాయం చేస్తూ ఉండటం నిజంగా గొప్ప విషయమని ఆమె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లేశ్వరి కుటుంబ సభ్యులను స్వయంగా కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి అనిత తెలిపారు.

పోలీస్ శాఖకు మల్లేశ్వరి ఒక ఆదర్శమని, ఇలాంటి సేవాభావం గల వ్యక్తులు పోలీస్ శాఖకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి అందించిన సేవలకు హోం మంత్రి అనిత మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

Related posts

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

Satyam News

శ్రీవారి భక్తుడితో దురుసుగా ప్రవర్తించిన టాక్సీ డ్రైవర్‌పై చర్యలు

Satyam News

అరకులోయలో యూ టీ ఎఫ్ రణభేరి

Satyam News

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

Satyam News

వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టం భావితరాలకు స్ఫూర్తి

Satyam News

కుక్కను కొట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

Satyam News

Leave a Comment