27.1 C
Hyderabad
September 21, 2026
విజయనగరంహోమ్

శ్రీ స్వామి రామానందుల వారి సమాధి ఆరాధన

#SwamyRamanandulu

ఈ సృష్టిలో గురువే మూలం అని, మోక్షాన్ని ప్రసాదించేది గురువే అని శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమ పీఠాధిపతి శ్రీ స్వామి అంతర్ముఖానంద గురూజీ డా. వీ. వేంకటేశ్వరరావు అన్నారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస లో శ్రీ స్వామి రామానందుల వారి సమాధి ఆరాధన ఉత్సవం మార్చి 9 సోమవారం జరిగింది.

ఈ సందర్బంగా ఆశ్రమ పీఠాధిపతి డా శ్రీగురూజీ శిష్యులకు ఆధ్యాత్మిక భాషణం చేశారు.సమాధి అంటే ఏమిటి, సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో వివరించారు. కళ్లు మూసుకుని కూర్చోవడం ధ్యానమని, ఉచ్వాస, నిస్వాసలను రాపిడి చేయడం యోగము, ప్రాణాయామం అని అన్నారు.

మహాత్ములైన శ్రీ స్వామి రామానందుల వారు నాకు ఇదే ఉపదేశించారని, నేను దాన్నే అందరికీ శ్రీస్వామిజీ ఆజ్ఞలతో ప్రసాదిస్తున్నానని శ్రీ గురూజీ ప్రవచించారు. ఈ కార్యక్రమంలో శిష్యులు శివరామకృష్ణ,జగ్గారావు, డా. హరగోపాద్, డా. సుబ్రహ్మణ్యం, విజయగోపాల్, రవి శాస్త్రి, లక్ష్మణరావు, భాస్కర్ లతో పాటు హైదరాబాద్, విజయవాడ, కర్నూల్, సిక్కోలు, విజయనగరం నుండి అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ

Satyam News

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలూ పరిష్కరిస్తున్నాం

Satyam News

సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు

Satyam News

బాలికను లైంగికంగా వేధించిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే?

Satyam News

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల  గ్యాస్ కొరత

Satyam News

మళ్లీ బీజేపీ రాజకీయాల్లోకి వరుణ్ గాంధీ?

Satyam News

Leave a Comment