సంపాదకీయంహోమ్

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌!

#NaraLokesh

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. గతేడాది డీఎస్సీ ప్రకటన రాగానే లేనిపోని ఆరోపణలతో కోర్టులకెళ్లి, నిరుద్యోగులను అయోమయానికి గురిచేసి నానా రచ్చ చేశారు జగన్. కానీ, వైసీపీ ఆడిన నాటకాలన్నీ పటాపంచలయ్యాయి. ఇక ఈసారి జగన్ నోటికి పక్కాగా తాళం వేసేలా నారా లోకేష్ విద్యాశాఖలో చారిత్రాత్మక మార్పులతో డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ను తీసుకొచ్చారు.

గతంలో కనీస అర్హత మార్కుల నిబంధన లేకపోవడంతో కేవలం 5, 10 మార్కులు వచ్చినా ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఉండేది. దీనివల్ల ప్రతిభకు గుర్తింపు లేకుండా పోయేది. కానీ, అర్హులైన వారికి మాత్రమే పారదర్శకంగా ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ఈసారి ‘కనీస అర్హత మార్కులు’ తప్పనిసరి చేసింది.

డీఎస్సీ 80%, టెట్ 20% కలిపి.. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30% కనీస మార్కులు వస్తేనే ఉద్యోగానికి అర్హత సాధిస్తారు. ఒకవేళ అర్హులైన అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను వచ్చే డీఎస్సీకి క్యారీ ఫార్వార్డ్ చేస్తారే తప్ప, అర్హత లేని వారికి ఇచ్చేదే లేదని పక్కాగా తేల్చి చెప్పారు. అంతేకాదు, స్పోర్ట్స్ కోటా, మాజీ సైనిక అభ్యర్థులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా కచ్చితంగా డీఎస్సీ రాసి కనీస మార్కులు సాధించాల్సిందే.

సాధారణ అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు సడలింపు ఇచ్చారు. మొత్తం పోస్టుల్లో 95 శాతం స్థానికులకే దక్కేలా, కేవలం 5 శాతం మాత్రమే అన్-రిజర్వ్‌డ్ కింద ఉంచి స్థానిక నిరుద్యోగులకు పెద్దపీట వేశారు.

మొత్తం 2వేల 111 రెగ్యులర్ టీచర్, 350 స్పెషల్ ఎడ్యుకేషన్, 260 సొసైటీ పోస్టులతో డీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబోతున్నారు. మెరిట్ జాబితా వచ్చిన 7 రోజుల్లోనే సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలనే నిబంధనతో ప్రక్రియ వేగవంతం చేశారు. ఉద్యోగాల భర్తీ జరుగుతుంటే ఓర్వలేని జగన్ ఎంత మొరిగినా.. అర్హులైన అభ్యర్థుల కల నెరవేర్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. పక్కా ప్రణాళికతో, పూర్తి పారదర్శకతతో డీఎస్సీ-2026కు శ్రీకారం చుట్టింది.

Related posts

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News

పోలవరం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనుల పరిశీలన

Satyam News

బూత్ లెవెల్ ఏజెంట్లతో మంత్రి దామోదర్ అవగాహన సమావేశం

Satyam News

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కిరణ్ కుమార్

Satyam News

మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్

Satyam News

మహిళా పోలీసుల గౌరవాన్ని కించపరిచేలా బీఆర్‌ఎస్‌ నేతల తీరు

Satyam News

Leave a Comment