26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

వెలుగుమట్ల బాధితుల కోసం కొనసాగుతున్న దీక్ష

ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తన దీక్షను కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం దీక్షా శిబిరంలో ఉన్న కవిత వివిధ దినపత్రికలను చదువుతూ కనిపించారు. అంతకుముందు సోమవారం నాడు ఖమ్మం జెడ్పీ సెంటర్‌లో వెలుగుమట్ల బాధితులు మరియు డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి ఆమె భారీ ఆందోళన నిర్వహించారు.

ఆ సమయంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అనంతరం ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఆమె తన నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే మంగళవారం ఉదయం పోలీసులు కవితతో పాటు దీక్షలో ఉన్న ఇతర నాయకులను మళ్ళీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

పోలీసుల అడ్డంకులు ఎదురైనప్పటికీ, బాధితుల కోసం తన పోరాటాన్ని ఆపకుండా హైదరాబాద్ జాగృతి కార్యాలయం వేదికగా ఆమె తన దీక్షను కొనసాగిస్తున్నారు.

Related posts

సత్యసాయి లేకున్నా ఇంకా ఎనర్జీ ఇక్కడే ఉంది

Satyam News

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News

మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కు

Satyam News

ఆందోళనకర స్థాయిలో బలహీనపడ్డ రూపాయి

Satyam News

చిన జీయర్‌ యూ టర్న్: వైసీపీలో డైలమా.!

Satyam News

డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా

Satyam News

Leave a Comment