25.2 C
Hyderabad
September 20, 2026
విశాఖపట్నంహోమ్

మనం ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరోకు ఘన సత్కారం

మనం దినపత్రిక ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరో ఎం వి ఎస్ జి తిలక్ కను పత్రిక యాజమాన్యం ఘనంగా సత్కరించింది. మనం దినపత్రిక ఆంధ్రప్రదేశ్ లో సంచలన కథనాలు ప్రచురిస్తూ ఎంత ప్రజాదరణ పొందుతూ అనేక సమస్యలు పరిష్కరించే దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర ప్రాంతం లో పత్రికను మరింత అభివృద్ధి చేసే విషయమై పత్రిక ఎడిటర్ వీ రమేష్ తో చర్చించేందుకుగాను తిలక్ హైదరాబాదులో గల ప్రధాన కార్యాలయంలో ఎండి నీ కలిసి పత్రిక అభివృద్ధిపై చేపట్టవలసిన అంశాలను చర్చించారు, అనతి కాలంలోనే ఉత్తరాంధ్ర లో సంచలన కథనాలు ప్రచురిస్తూ, అన్ని ప్రాంతాల్లో పత్రికకు గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్న ఎం వి ఎస్ జి తిలక్ కృషిని ఎండి అభినందించారు.

ఈ సందర్భంగా మనం దినపత్రిక సిబ్బందితో కలిసి తిలక్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ,తెలంగాణ మనం అసోసియేట్ ఎడిటర్ కృష్ణ, ఏపీ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మదనయ్య, ఏపీ తెలంగాణ నెట్వర్క్ ఇన్చార్జ్ విజయ్, తెలంగాణ స్టేట్ బ్యూరో వేదాంత, తెలంగాణ క్రైమ్ బ్యూరో ధర్మ పాల్గొన్నారు.

Related posts

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News

రామరాజ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

క‌మ్యూనిస్ట్ ల కుట్ర‌లో భాగమే ఏయూ ఘ‌ట‌న‌

Satyam News

రామాలయ నిధులు కొట్టేసింది విశ్వ హిందూ పరిషత్?

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

ఈ నెల 14 లోగా డిజిటిలైజేష‌న్  ప్ర‌క్రియ‌ను పూర్తి

Satyam News

Leave a Comment