26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

వచ్చే నెలలో పెళ్లి… నేడు ప్రమాదం లో మృతి

#Accident

విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గల బి.హెచ్.పి.వి (BHPV) కూడలి వద్ద అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ పాయింట్ వద్ద నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాలను, ఒక ఇన్నోవా కారును వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు లారీ చక్రాల కింద నలిగిపోయి, గుర్తుపట్టలేని విధంగా అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒకరైన రామకృష్ణ తన కుమార్తె స్వప్నతో కలిసి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షకు ముందు దైవదర్శనం కోసం వెళ్తున్న తండ్రిని మృత్యువు లారీ రూపంలో కబళించింది.

మరో మృతుడు శ్రీనగర్ ప్రాంతానికి చెందిన సతీష్‌గా గుర్తించారు. వచ్చే నెలలో వివాహం నిశ్చయమైన సతీష్, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించాలి

Satyam News

మోడీ ప్రవర్తన తీరు దేశానికి అవమానకరం

Satyam News

కూతురి నిశ్చితార్థంకు పార్టీ చొక్కాతో కన్నతండ్రి!

Satyam News

హెడ్ కానిస్టేబుల్ కు అండగా నిలిచిన పోలీసు శాఖ

Satyam News

ప్రభుత్వ బడుల్లో విద్య మరింత బలోపేతం

Satyam News

కొత్త స్టోరీ: ఇరాన్ అమెరికా చర్చలు మళ్లీ మొదలు?

Satyam News

Leave a Comment