కృష్ణహోమ్

హెడ్ కానిస్టేబుల్ కు అండగా నిలిచిన పోలీసు శాఖ

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF) విజయవాడ జోన్ 1998 బ్యాచ్‌కు చెందిన ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వై. రాజశేఖర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన 2024 జనవరిలో ఎస్పీఎఫ్ విభాగం నుండి వాలంటరీ రిటైర్మెంట్ పొందారు.

విభాగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో విజయవాడ జోన్ తరఫున రూ.2,40,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేయబడింది.

ఈ మొత్తాన్ని విజయవాడ జోన్ పరిధిలోని విజయవాడ గార్డ్స్ యూనిట్, ఏపీ సెక్రటేరియట్ యూనిట్, ఏపీ హైకోర్టు యూనిట్ మరియు కమాండెంట్ ఆఫీస్ సిబ్బంది కలిసి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. కమాండెంట్ ఎం. శంకరరావు ద్వారా, డీఎస్పీలు మల్లికార్జున్ రావు ఏపీ సెక్రటేరియట్ యూనిట్, హేమసుందర్ రావు మరియు ఇన్స్పెక్టర్ ఫణి కుమార్ విజయవాడ గార్డ్ యూనిట్ ఆధ్వర్యంలో అన్ని యూనిట్ల సిబ్బంది సమక్షంలో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మరియు సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.

Related posts

బీసీ నాయకుడి కాళ్లు విరగ్గొట్టిన వైసీపీ కార్యకర్తలు!

Satyam News

కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటున్న బంగ్లాదేశీయులు

Satyam News

అసమానతలను రూపుమాపి రాజ్యాంగ విలువలను కాపాడాలి

Satyam News

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

Satyam News

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

Leave a Comment