26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

రియల్ హీరో సుధాకర్: పాములు పట్టి అడవుల్లో విడిచే సేవ

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణ నివాసి వేమవరపు సుధాకర్ నియోజకవర్గానికి చేసిన సేవకు విలువ కట్టలేనిది, ఎక్కడ పాములు కనిపించి ప్రజలు భయాందోళనలకు గురయ్యే సమయంలో వెంటనే అక్కడికి చేరుకుని వాటిని సురక్షితంగా పట్టి అడవుల్లో విడిచే సేవలో వేమవరపు సుధాకర్ విశేషంగా సేవలందిస్తున్నారు.

చిన్నతనం నుంచే పాములను పట్టుకోవడంలో నైపుణ్యం కలిగిన ఆయన ఇప్పటివరకు సుమారు 15 వేల పాములను పట్టుకుని అడవుల్లో విడిచినట్లు సమాచారం. పాము కాటు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పాము కరిసిన వారికి తక్షణ ఫస్ట్ ఎయిడ్ అందించడం వంటి సేవలను కూడా సుధాకర్ అందిస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు 20 మందిని పాము కాటు నుంచి రక్షించినట్లు ఆయన తెలిపారు. సేవలందిస్తున్న సమయంలో ఇప్పటివరకు సుమారు 27 సార్లు పాములు కరిచినా కూడా ఆయన వెనుదిరగకుండా తన సేవలను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సులో కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలందించడం విశేషం. సుధాకర్ చేస్తున్న సేవలను స్థానిక ప్రజలు అభినందిస్తూ, ఆయన సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొంటున్నారు.

Related posts

రాఘవ్ చద్దా తొలగింపునకు అసలు కారణం ఏమిటి?

Satyam News

పాత మంగళగిరి హిందూ శ్మశానవాటికకు సరికొత్త రూపు

Satyam News

కారు పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?

Satyam News

గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మారికవలస సెంటర్

Satyam News

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

Satyam News

న్యూజెర్సీలో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్ రావు

Satyam News

Leave a Comment