26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఆహార కల్తీ నియంత్రణకు సర్వైలెన్స్ టీమ్ (H-FAST)

#SajjanarIPS

హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో ‘హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్’ (H-FAST) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ విభాగాన్ని గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. ఆహార కల్తీకి వ్యతిరేకంగా పక్కా సమాచారంతో, పటిష్టమైన యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకోవడం ఈ విభాగం ప్రధాన ఉద్దేశ్యం.

హెచ్-ఫాస్ట్ (H-FAST) విభాగంలో ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. ఆహార కల్తీకి పాల్పడే వారిని గుర్తించడం, నిఘా ఉంచడం, దాడులు నిర్వహించడం మరియు నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం వీరి ప్రధాన బాధ్యత.

ఈ బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తూ, సమర్థవంతమైన పర్యవేక్షణను నిర్ధారిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు రమ్య, అభిలాష్, అఖిల్, కృష్ణ మరియు ఇతర బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్

ఆహార కల్తీ లేదా అసురక్షిత ఆహార పదార్థాల గురించి సమాచారం అందించడానికి ప్రజల కోసం ప్రత్యేకంగా 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. పౌరులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా హెచ్-ఫాస్ట్ (H-FAST) టీమ్‌కు పంపవచ్చు.

ఆహార కల్తీ అనేది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే తీవ్రమైన నేరమని, దీనిని అరికట్టడంలో ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. కల్తీకి పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత ఆహార తయారీ కేంద్రాల గురించి సమాచారం అందిస్తూ పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Related posts

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుప్రీంకోర్టుకు….?

Satyam News

కారుణ్య మ‌ర‌ణాల‌కు ఇక మార్గం సుగ‌మం

Satyam News

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్‌ ప్రత్యేకత ఇదీ

Satyam News

జనరల్ ఇన్సూరెన్స్ పరిహారం చెక్కులు ఇవిగో…

Satyam News

డిజిటల్ అరెస్టు మోసాలకు రూ.54 వేల కోట్లు హాంఫట్

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

Leave a Comment