ముఖ్యంశాలు హోమ్

వైసీపీకి బిరియానీ దెబ్బ… జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు

#YSJagan

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి బిరియానీ పదం కలిసి వచ్చినట్లు కనిపించడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.. ఈ ఎన్నికలలో ఆయన పార్టీ ఘోరంగా ఓటమి పాలయిన నాటి నుండి తాను బిరియానీ పెడతానని హామీ ఇస్తే, ప్రజలు తనకు ఓటు వేయలేదని ఆయన సెటైర్లు వేయడం షురూ చేశారు.. ఆయననే ఫాలో అయిన ఆయన అభిమానులు జగన్‌ అన్న బిరియానీ పథకాన్ని అమలు చేయాలనుకున్నట్లున్నారు.. దానికి, మంచీ చెడు, సంప్రదాయాలు, సంస్కృతితో సంబంధం లేకుండా జగన్‌ అన్ననే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్లున్నారు.. ఏకంగా వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల మండపాల దగ్గర ఏకంగా చికెన్‌ బిరియానీలు వడ్డించారు.. దీనిపై దేశ వ్యాప్తంగా హిందూ భక్తులలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి..

నందిగామ మాజీ ఎమ్‌ఎల్‌ఏ మొండితోక మోహన్‌ రావు.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.. గ్రాండ్‌గా చికెన్‌ బిరియానీ, చికెర్‌ కర్రీతో నాన్‌ వెజ్‌ వంటకాలు వండించారు.. అయితే, పక్కనే వినాయక మండపం ఉందని, అక్కడ పూజలు జరుగుతున్నాయని తెలిసి కూడా మొండితోక మోహన్‌ రావు టీమ్‌.. ఇవేవీ పట్టించుకోకుండా నాన్‌ వెజ్‌ విందు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది.. ఈ అంశం జాతీయ మీడియాలోనూ వైరల్‌గా మారింది..

దేశవ్యాప్తంగా టాప్‌ హిందీ, ఇంగ్లీష్‌ మీడియా … ఈ అంశాన్ని కవర్‌ చేసింది…. పలు కథనాలు టెలికాస్ట్‌ చేశారు.. వైసీపీ మాజీ ఎమ్‌ఎల్‌ఏతోపాటు ఆయన అనుచరుల తీరుపైనా హిందువులలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంతర్వేదిలో రథం తగలబడిన అంశంతోపాటు హనుమంతుని విగ్రహం చేయి ధ్వంసం అంశాలు కూడా గుర్తు చేశాయి.. ఇటు, విజయనగరం జిల్లాలో రాముల వారి ఆలయంలో జరిగిన ఘటనలను సైతం గుర్తు చేశారు పలువురు ప్రతినిధులు.. రెండు మూడు రోజులపాటు ఈ అంశంపై జాతీయ మీడియా ఫోకస్‌ చేసింది.. డిబేట్లు నిర్వహించింది. వైసీపీ ఈ అంశంపై సమర్ధించుకునే ప్రయత్నం చేసింది మినహా…. హిందువుల మనోభావాలు, ఆచారాలు, సంప్రదాయలను గౌరవించలేడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

వైసీపీ సర్కార్‌ హయాంలో తిరుమలలోని లడ్డూ ప్రసాదంలో కొవ్వులు కలిశాయనే ఆరోపణలు వచ్చాయి.. దీనిపై సీబీఐ విచారణ నడుస్తోంది.. అయినా, ఆ పార్టీ తీరుమారడం లేదు.. దేశవ్యాప్తంగా వైసీపీపై హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు..

Related posts

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News

సామర్ధ్యం పెంచుకున్న భారత నావికాదళం

Satyam News

Leave a Comment

error: Content is protected !!