25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

పోలీసులు నిలబెట్టిన కాపురం

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతులు ఆత్మహత్యకు యత్నిస్తున్నామని బంధువులకు ఓ మహిళ సమాచారం ఇచ్చింది.

ఈ సమాచారం అందుకున్న మహిళ బంధువులు వెంటనే నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎస్సై కిషోర్ సెల్ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి తన పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లైఓవర్‌ ప్రాంతానికి చేరుకున్నారు. వారి ఆత్మహత్య యత్నాన్ని విరమింపజేశారు.

దీంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పిలుచుకున్నారు. పూర్తి వివరాలను ఎస్ఐ కిషోర్ తెలియజేస్తూ, దుర్గి నుంచి బయలుదేరి, సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి ఇటుగా వస్తున్నారని తమకు వారి కుటుంబ సభ్యులు సమాచారం అందిందన్నారు.

ఆర్ధిక ఇబ్బందుల వల్ల అమరేంద్ర, త్రివేణి దంపతులు తమ కూతురు, కొడుకును తీసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళారని తెలియడంతో, ఫోన్ నెంబర్ ను ట్రెస్ చేసి నరసరావుపేటలోని ఎస్ఆర్కెటీ వద్ద పట్టుకున్నామని తెలిపారు. తరువాత వారి కుటుంబ సభ్యులకు పిలిచి అప్పగించడం జరిగిందన్నారు.

వారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం కాదని అవగాహన కల్పించారు. సమయస్ఫూర్తితో స్పందించిన ఎస్సై కిషోర్, పోలీసులును పట్టణ ప్రజలు అభినందించారు.

Related posts

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

Satyam News

ఈ చిత్రంలో కూడా జాన్వీ అందాల ఆరబోతేనా?

Satyam News

పోలవరం ఎమ్మెల్యేపై దాడి: పరిస్థితి ఉద్రిక్తం

Satyam News

దీపావళి వేళ వంటవాడి అవతారం

Satyam News

షరతులు పాటిస్తేనే ఇక అమెరికాతో చర్చలు

Satyam News

Leave a Comment