మహబూబ్ నగర్హోమ్

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

#SunithaReddyIPS

ప్రజలకు మరింత చేరువగా, వేగవంతంగా  పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో సీరియస్ నేరాలలో ‘ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్ ’ విధానాన్ని అమలు చేస్తున్నామని వనపర్తి జిల్లా ఎస్పీ సునితరెడ్డి  తెలిపారు.

వనపర్తి జిల్లా పోలీసు  ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు “ఆన్‌సైట్  ఎఫ్ఐఆర్ (ఆన్ సైట్ ఎఫ్ఐఆర్) గుమ్మం దగ్గరకు ఎఫ్ఐఆర్, విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. బాధితులు హత్య, అత్యాచారం,దోపిడీ / చోరీ, కిడ్నాప్,మహిళలు, చిన్నారులపై నేరాలు,రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ ఎస్టీ, బాల్యవివాహాలు, ర్యాగింగ్ వంటి సీరియస్ నేరాల్లో బాధితులు పోలీస్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ ఉంటే అక్కడ బాధితుల నివాసం, హాస్పిటల్, రక్షణ ప్రదేశం, సంఘటన చోటుచేసుకున్న ప్రదేశంలోనే పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్   నమోదు చేస్తారని తెలిపారు.

సంఘటన స్థలంలోనే ఎఫ్ఐఆర్  నమోదు చేయడం ద్వారా ఆధారాలు సేకరణ వేగంగా నిందితులను త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సేవ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, మహిళలకు, వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

దీని ద్వారా సమయం ఆదా అవడంతో పాటు, బాధితులకు తక్షణ సహాయం అందుతుందని, ప్రజలు ఎలాంటి సంఘటన జరిగినా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ‘ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్ ’ ద్వారా మీ వద్దకే  వచ్చి సేవలు అందిస్తామని ఇది ప్రజల నమ్మకాన్ని పెంచే దిశగా తీసుకున్న కీలక నిర్ణయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవను వినియోగించుకొని న్యాయం పొందాలని కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం

Satyam News

గోవా పర్యాటక విధానం బాపట్లకు ఆదర్శం

Satyam News

గిరి బలిజ జీ ఓ రద్దు చెయ్యాలి

Satyam News

ఏపీకి 10 గ్రోత్‌ ఇంజన్లు… 10 నగరాల్లో అభివృద్ధి పరుగులు..!!

Satyam News

తిరుమల ల్యాబ్ పై రాజకీయం మొదలెట్టిన వైసీపీ

Satyam News

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా భారతదేశం

Satyam News

Leave a Comment