25.2 C
Hyderabad
September 20, 2026
అనంతపురంహోమ్

గ్లోబల్ సి బి ఎస్ ఈ  స్కూల్ కు నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు

#Global

అనంతపురం గ్లోబల్ CBSC స్కూల్ విద్యారంగంలో వినూత్న ఆవిష్కరణలు, సృజనాత్మక బోధన విధానాలు అమలు చేస్తున్నందుకు గాను గ్లోబల్ CBSC  స్కూల్ మేనేజ్‌మెంట్‌కు బెంగళూరులో   నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు 2026 అందజేశారు.

గుణాత్మక విద్య  తో పాటు క్రీడలలో కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూ నూతన ఆవిష్కరణ దిశగా  గ్లోబల్ విద్యాసంస్థలు పయనిస్తుండడం.. ఆ విద్యాసంస్థల  నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని విద్యావేత్తలు అంటున్నారు. అనంత విద్యార్థులకు చక్కటి విద్యావేదికగా ఉన్న  గ్లోబల్ CBSC  విద్యాసంస్థలకు ఈ అవార్డు రావడం శుభ పరిణామం.

ఈ అవార్డును స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు పి. ప్రతాప్ రెడ్డి, వై. మధుసూదన్ రెడ్డి, ఎన్. మాబు బాషా గౌరవంగా స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన  నేషనల్ వైడ్లి   విద్యా నిపుణులు, పాఠశాల ప్రతినిధులు, పాల్గొన్నారు. విద్యలో నూతన ఆలోచనలు, సాంకేతికత వినియోగం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేసినందుకు ఈ అవార్డు ప్రదానం చేయబడినట్లు నిర్వాహకులు తెలిపారు.

అవార్డు స్వీకరించిన అనంతరం మాబు భాష  మాట్లాడుతూ.. ఈ గౌరవం మా మొత్తం టీమ్‌కు దక్కిందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మధుసూదన్ రెడ్డి, పి.ప్రతాప్ రెడ్డి కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు తమకు మరింత బాధ్యతను కల్పించిందన్నారు. ఈ అవార్డు ద్వారా గ్లోబల్ సివిఎస్ఇ   స్కూల్ దేశవ్యాప్తంగా విద్యా రంగంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.

Related posts

అంపశయ్యపై నుంచి అభివృద్ధి పథంలోకి…

Satyam News

శ్రీ దర్బార్ మైసమ్మకు పట్టువస్త్రాల సమర్పణ

Satyam News

పినరయ్ విజయన్ ఇంటిపై ఈడీ దాడులు

Satyam News

తప్పుడు ప్రచారం కేసులో జగన్ సి పి ఆర్ ఓ అరెస్టు

Satyam News

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News

టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Satyam News

Leave a Comment