సంపాదకీయంహోమ్

మెరుస్తున్న కలలకు వాస్తవ రూపం

#ProfRamGopalRao

ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్, నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశం గర్వించే శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి. రామ్‌గోపాల్ రావు లింక్డ్‌ఇన్‌లో రాసిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన రాసిన పోస్టులో ఏమున్నదంటే…

“What the Government of Andhra Pradesh is doing now is truly commendable. Appointing eminent academics as Vice Chancellors and Directors is one of the strongest signals a government can send that it values merit and takes higher education seriously. For the first time, I see real hope, at least in one state government, for state universities and institutions to turn around. Kudos to the Andhra Pradesh Government. I sincerely hope this continues.”

(తెలుగు అనువాదం: “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పని నిజంగా అభినందనీయం. ప్రముఖ విద్యావేత్తలను వైస్ ఛాన్సలర్లుగా, డైరెక్టర్లుగా నియమించడం అనేది, ప్రభుత్వం ప్రతిభకు విలువనిస్తుందని మరియు ఉన్నత విద్యను సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పడానికి అత్యంత బలమైన సంకేతం. మొదటిసారిగా, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు పుంజుకుంటాయనే నిజమైన ఆశ నాకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు. ఇది ఇలాగే కొనసాగుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.”)

ఇవి సాధారణ మాటలు కాదు. దేశంలో వందల యూనివర్సిటీలను దగ్గరగా చూసిన ఒక మేధావి “మొదటిసారి నిజమైన ఆశ కనిపిస్తోంది” అని చెప్పడం అంటే… అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరికిన ఒక జాతీయ ధృవపత్రం! ఆ మాటలు చదువుతుంటే, ఒక తల్లి మనసు పొరల్లో ఎక్కడో నొప్పి కలిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే, ఆ “మొదటిసారి” అనే పదంలో దాగిన అర్థం మనకు గుండెలో గుచ్చుకుంటుంది. గత ఐదేళ్లూ… మన విశ్వవిద్యాలయాలు ఏమైనాయో మనందరికీ తెలుసు.

“కులపతి” అనే పదానికి అర్థం ‘జ్ఞాన కులపతి’ కాదు, స్వకులం నుండి పతులుగా పెట్టాలనే అర్థంగా మారిపోయింది. పోటీ పరీక్షలు కాదు, కుల అర్హత. పరిశోధన పత్రాలు కాదు, రాజకీయ విధేయత. విద్యా ప్రమాణాలు కాదు, అజెండా అనుసరణ  ఇవే నియామక ప్రమాణాలయ్యాయి.

వై ఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కులపతులుగా వారి కులానికి చెందిన వారో, వారి మతానికి చెందినవారూ నియమితులయ్యారు తప్ప వేరే అర్హతలు చూడలేదు. ఆ రోజుల్లో మేధావులు తలలు వంచుకుని నిట్టూర్చారు. విద్యార్థులు అవకాశాలు వెతుక్కుంటూ రాష్ట్రం విడిచి వెళ్ళారు. NIRF ర్యాంకింగ్‌ పట్టీలో ఏపీ విశ్వవిద్యాలయాలు అట్టడుగుకు జారిపోయాయి. ఒక తరం యువతకు చేసిన అన్యాయానికి ఆ లెక్క ఏ కోర్టులోనూ తీరేది కాదు.

ఇప్పుడు మంత్రి నారా లోకేష్ చేతుల్లో విద్యాశాఖ ఉంది. మాటలు కాదు, చేతలు మాట్లాడుతున్నాయి. ఐఐటీ కాన్పూర్ నుండి నిపుణులు వచ్చారు. పేరున్న విద్యావేత్తలు వైస్ ఛాన్సలర్ పదవులు చేపట్టారు. మొదటిసారి విశ్వవిద్యాలయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి… కులం కోసం కాదు, కాన్వకేషన్ కోసం!

ప్రొఫెసర్ రామ్‌గోపాల్ రావు వంటి మహానుభావుడు గుర్తించిన ఈ మార్పు చిన్నది కాదు. ఇది ఒక విత్తనం నాటడం  భవిష్యత్ తరాలకు పండే ఫలవృక్షానికి నాంది.

మెరిట్ ఒక్కటే ప్రమాణం అయినప్పుడు.. పరిశోధనలు వేళ్ళూనుకుంటాయి… పేటెంట్లు మొగ్గ తొడుగుతాయి…. ర్యాంకింగ్‌లు ఆకాశాన్ని అందుకుంటాయి… విద్యార్థుల కలలకు రెక్కలొస్తాయి.

ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మన విశ్వవిద్యాలయాలు ‘కుల గూళ్ళు’ కాకుండా, ప్రపంచం గుర్తించే జ్ఞాన దీపస్తంభాలుగా మారాలంటే ఈ మార్పు ఆగకూడదు, వెనక్కి తిరగకూడదు. ఒక తరానికి జరిగిన నష్టాన్ని రాబోయే తరానికి అవకాశంగా మార్చే శక్తి ఈ విధానానికి ఉంది.

ప్రొఫెసర్ రామ్‌గోపాల్ రావు గారు చెప్పారు “I sincerely hope this continues.”.. మేమూ అదే ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం అదే ఆశిస్తోంది!

Related posts

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

Satyam News

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ గుర్తింపు

Satyam News

కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లే

Satyam News

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

Satyam News

మరింత తగ్గనున్న వైసీపీ సీట్లు, ఓట్లు….!!

Satyam News

రెండు యూట్యూబ్ ఛానెళ్ల పై కేసులు

Satyam News

Leave a Comment