26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

#Petrol

గత కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మరియు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ చర్చల అనంతరం, ఈ నెలలో డిమాండ్‌కు అనుగుణంగా సాధారణం కంటే 10 శాతం అదనంగా పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేయడానికి ఆయిల్ కంపెనీలు అంగీకరించాయి. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని ట్రేడర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇకపై సరఫరా క్రమబద్ధంగా జరుగుతుందని, పుకార్లను నమ్మి కంగారు పడవద్దని అధికారులు సూచించారు.

Related posts

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News

పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్

Satyam News

గూగుల్‌ని మించి అంబానీ భారీ పెట్టుబడి.!

Satyam News

విద్యా వికాసం కోసమే “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్”

Satyam News

గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో భారీగా పతనమైన రూపాయి

Satyam News

జొన్న‌గుడ్డిలో కార్డ‌న్ సెర్చ్‌: ఆరుగురిపై స‌స్పెక్ట్స్ షీట్స్‌

Satyam News

Leave a Comment