25.2 C
Hyderabad
September 20, 2026
సంపాదకీయంహోమ్

అమరావతిపై వైసీపీ ఫేక్ నెరేటివ్స్…అసలు నిజాలివి.!

#Jagan

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై కొంతకాలంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమరావతి నిర్మాణం అంటే వేల కోట్ల వృధా అని, ఒక్కో చదరపు అడుగుకు లక్షల్లో ఖర్చవుతోందంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు, మద్దతుదారులు ఫేక్ నెరేటివ్స్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ఐతే వాస్తవానికి అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలు, సెక్రటేరియట్ టవర్ల నిర్మాణ వ్యయం సగటున చదరపు అడుగుకు రూ. 6,980 నుంచి రూ. 7,000 లోపే ఉంటుండగా, దీనిని రూ. 12,000 నుంచి రూ. 14,000 గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ప్రజా అవసరాల కోసం కడుతున్న అడ్మినిస్ట్రేటివ్ సిటీని, వ్యక్తిగత విలాసాల కోసం నిర్మించిన రుషికొండ లాంటి కట్టడాలతో పోల్చి చూడటమే ఇక్కడ అతిపెద్ద అబద్ధం.

రాజధాని నిర్మాణ వ్యయంపై బురద జల్లే వారు ఒక్కసారి విశాఖలోని రుషికొండ ప్యాలెస్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఒక వ్యక్తి నివాసం కోసం, అది కూడా పర్యాటక శాఖ రిసార్ట్స్ ధ్వంసం చేసి రూ. 500 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్మించిన ఆ కట్టడం విలాసానికి నిలువుటద్దం. అక్కడ వాడిన ఒక్కో బాత్‌టబ్ ధర రూ. 36 లక్షలు, కమ్మోడ్ల ధర రూ. 12 లక్షలు అంటే అది ప్రజల కోసం చేసిన ఖర్చు కాదని ఇట్టే అర్థమవుతుంది.

పబ్లిక్ సెక్రటేరియట్ లేదా హైకోర్టు వంటి ప్రజా వినియోగ కట్టడాలకు అయ్యే ఖర్చును, ఒక ప్రైవేట్ రిట్రీట్ లాంటి ప్యాలెస్ ఖర్చుతో పోల్చడం ఏ మాత్రం సరికాదు. అమరావతిలో ప్రతి రూపాయి లక్షలాది మందికి సేవలు అందించే మౌలిక సదుపాయాల కోసం ఖర్చవుతోంది.

అమరావతి సెల్ఫ్-సస్టెనబుల్ ఫైనాన్షియల్ మోడల్ మీద ఆధారపడి ఉంది. అంటే ఇక్కడ జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు భవిష్యత్తులో భూముల విలువ పెరగడం ద్వారా తిరిగి రాష్ట్ర ఖజానాకే చేరుతుంది. కానీ రుషికొండ వంటి చోట్ల చేసిన ఖర్చు తిరిగి రాదు కదా, దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి నెలా లక్షలాది రూపాయల కరెంట్ బిల్లులు, నిర్వహణ భారం ప్రజల మీద పడుతోంది.

అమరావతిలో కడుతున్న అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు వందల ఏళ్ల పాటు రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువులుగా ఉంటాయి. ఇవి ప్రజల ఆస్తులు, ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం కోసం కట్టుకున్న విలాసవంతమైన భవనాలు కావు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతి పనులను వేగవంతం చేసింది. ఒకవైపు విలాసవంతమైన ప్యాలెస్‌ల కోసం ప్రజా ధనం తగలేసిన చరిత్ర ఉంటే, మరోవైపు ప్రతి రూపాయికి జవాబుదారీతనంతో రాజధానిని నిర్మించే సంకల్పం కనిపిస్తోంది. ఫేక్ నెరేటివ్స్ సృష్టించే వారు గమనించాల్సింది ఏంటంటే.. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేసి కట్టుకునే అంతఃపురాలు కాదు, సామాన్యుడికి సైతం గర్వకారణంగా నిలిచే ప్రజా రాజధాని. ఈ వాస్తవం రేపటి అమరావతి గెలుపుతో మరింత స్పష్టంగా ఆవిష్కృతం కానుంది.

Related posts

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పై దాడి

Satyam News

సిద్ధరామయ్య రాజీనామా: డీ కే కు ఇక లైన్ క్లియర్

Satyam News

మరో పోలీస్ అధికారి ఆత్మహత్య

Satyam News

ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండండి

Satyam News

రక్షణ రంగ నిపుణుడు మరూఫ్ రజా ఇక లేరు

Satyam News

ఎర్రకోట పేలుళ్ల ఘటనలో కీలక అరెస్టు

Satyam News

Leave a Comment