26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

NEET-UG పరీక్ష రద్దు: లీక్ కన్ఫర్మ్

#Doctor

మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET-UG) ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో ఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్షా పారదర్శకత దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ రద్దుతో దేశవ్యాప్తంగా పరీక్షకు హాజరైన సుమారు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్డీఏ స్పందిస్తూ, త్వరలోనే నీట్ పరీక్షా కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. మరో వారం లేదా పది రోజుల్లోగా పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మళ్లీ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, అర్హులైన వారికే న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

Related posts

మేడారం జాతర పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ

Satyam News

బంగ్లాదేశ్ లో హిందువు హత్యపై ఢిల్లీలో నిరసన

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయా?

Satyam News

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

Satyam News

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తాం

Satyam News

అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం నవతరం పార్టీ కృషి

Satyam News

Leave a Comment